2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి, గురువారం స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ ఇండియాకు అపూర్వ స్వాగతం లభించింది. బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన రోహిత్ సేన ముందు ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మోదీ, టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. టీ20 కప్పు గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు.
- మట్టి రుచి ఎలా ఉంది రోహిత్?
దక్షిణాఫ్రికాతో ఫైనల్ గెలిచాక ప్లేయర్లు అందరూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్ పిచ్ మీద మట్టిని తీసుకుని తిన్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని గుర్తు చేసిన ప్రధాని ‘రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది?’ అని ప్రశ్నించారు. అలానే థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఒత్తిడిని ఎలా తట్టుకున్నారని ప్లేయర్స్‌ని అడిగారు.
- 16 ఓవర వేసే ముందు నీ మనసులో ఏముంది?
చివరి ఐదు ఓవర్లలో మ్యాచ్ ఊహించని మలుపులు తిరిగింది. దక్షిణాప్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో టీమ్ ఇండియా అభిమానులంతా ఆశలు వదులుకున్నారు. ఆ దశలో 16 ఓవర్ వేసిన బుమ్రా, దక్షిణఫ్రికాపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. ఆ ఓవర్ వేసే సమయంలో నీ మనసులో ఏముంది? అని మోదీ అడిగారు.
- సూర్య క్యాచ్ గుర్తు చేసుకున్న మోదీ
బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్‌తో, ఇండియాకు కప్పు అందించిన సూర్య క్యాచ్‌ను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
టోర్నీలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆటతీరుపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాల్సినప్పడు ఫైనల్ ఓవర్ ఒత్తిడిని ఎలా తట్టుకున్నావ్? అని ప్రశ్నించారు.
- మంచి స్కోరు చేయడం ఎలా అనిపించింది?
ఫైనల్ మ్యాచ్‌లో ప్రారంభంలోనే భారత్ కీలక వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో వచ్చి, మంచి స్కోరు చేయడం ఎలా అనిపించింది? అని మోదీ అతడిని ప్రశ్నించారు. ఫైనల్ మ్యాచ్‌లో మూడో డౌన్‌లో క్రీజులోకి వచ్చిన అక్షర్ 47 పరుగులు చేశాడు. ఇందులో 1 ఫోర్, 4 సిక్సులు ఉన్నాయి.
'ఐయామ్ సారీ' - హార్దిక్‌కు క్షమాపణలు చెబుతున్న ముంబయి ఫ్యాన్స్ - Mumbai Fans Sorry To Hardik
లైవ్ టీమ్ఇండియాకు గ్రాండ్ వెల్కమ్ - సముద్రాన్ని తలపిస్తున్న ముంబయి రోడ్లు - T20 WORLD CUP LIVE