Paris Olympics Indian Athletes : ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్ దగ్గరపడుతున్న కొద్ది క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకుంటోంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు పారిస్‌కు చేరుకున్నారు. విశ్వక్రీడల్లో తమ సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనికితగ్గట్లుగా ఆతిథ్య దేశమైన పారిస్ కూడా అథ్లెట్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
ఇక తమ ఆటతోనే కాదు జెర్సీలతోనూ ఆకట్టుకునేందుకు ఆయా దేశాల ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తమ దేశ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ప్రత్యేక రంగులు, డిజైన్లతో కూడిన జెర్సీలను ధరించనున్నారు. మన భారత అథ్లెట్లు వేసుకోనున్న క్రీడా దుస్తులు కూడా ఘనమైన దేశ వారసత్వను ప్రతిబింబిచేలా ఉండనున్నాయి.
Ceremonial outfit dress for team india 🇮🇳at the Paris Olympic 2024 pic.twitter.com/QSbSSorpzG
— aratasports (@aratasport45511) July 16, 2024
ఇందులో భాగంగా ఇక్కడి డిజైనర్స్ అథ్లెట్ల కోసం మూడు రకాల కిట్లను సిద్ధం చేశారు. గేమ్‌లో ధరించేందుకు నీలం రంగు జెర్సీని జేఎస్‌డబ్ల్యూ ఇన్‌స్పైర్ రూపొందించగా, ఆరంభ, ముగింపు వేడుకల కోసం త్రివర్ణ పతాకంలోని రంగులతో కూడిన ప్రత్యేక చీరలను అలాగే కుర్తా, పైజామాను రూపొందించారు. ఇక ట్రావెలింగ్ టైమ్ వేసుకునే దుస్తులను ప్రముఖ స్పోర్ట్స్ వేర్ విక్రయ సంస్థ ప్యూమా రెడీ చేసింది.
VIDEO | Indian Olympic Association (IOA) president @PTUshaOfficial and Union Sports minister @ianuragthakur unveil ceremonial dress and player kit for the Indian contingent for #AsianGames, in Delhi. pic.twitter.com/y78lQCUnsk
— Press Trust of India (@PTI_News) September 5, 2023
ఇదిలా ఉండగా, పారిస్ ఒలింపిక్స్ క్రీడా గ్రామంలోని తాజాగా కొంతమంది భారత అథ్లెట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్చరీ, రోయింగ్ టీమ్స్ క్రీడా గ్రామాన్ని చేరుకున్నాయని ఒలింపిక్స్‌కు భారత చెఫ్ డి మిషన్‌గా బాధ్యతలు అందుకున్న దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ వెల్లడించాడు.
"గురువారం రాత్రి నేను పారిస్ చేరుకున్నా. భారత్ నుంచి మొదటగా ఆర్చరీ, రోయింగ్ బృందాలు శుక్రవారం క్రీడా గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చాయి. మన అథ్లెట్లు ఇక్కడ నెమ్మదిగా కుదురుకుంటున్నారు. పురుషుల హాకీ జట్టు కూడా ఈ గ్రామానికి చేరుకోనుంది. ప్లేయర్లందరూ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్నారు. పోటీల వేదికలో ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము కల్పిస్తాం. ఒలింపిక్స్ కోసం చెఫ్ డి మిషన్‌గా పారిస్‌కు రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. భారత అథ్లెట్ల బృందంలో స్ఫూర్తి నింపేందుకు నేను ఎల్లవేళల ప్రయత్నిస్తాను. పతకాలు సాధించే సత్తా ఉన్న భారత అథ్లెట్ల సంఖ్య పెరగడం ఎంతో గర్వంగా ఉంది" అంటూ నారంగ్ మీడియాకు తెలిపాడు.
తండ్రి చివరి కోరిక నేరవేర్చనున్న జార్జియా షూటర్ - ఎవరీ నినో ? - Paris Olympics 2024