Paris Olympics Day 5 India: పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు భారత్‌కు మంచి ఫలితాలే దక్కాయి. స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా (ఎస్టోనియా)పై 21-5, 21-10 తేడాతో నెగ్గి రౌండ్ 16 (ప్రీ క్వార్టర్స్)కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల ఆట 34 నిమిషాల్లోనే ముగిసింది. మరోవైపు లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్‌లో జొనాథన్ (ఇండోనేసియా)తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో నెగ్గి ప్రీ క్వార్టర్స్‌కు వెళ్లాడు.
🇮🇳 𝗦𝗶𝗻𝗱𝗵𝘂 𝘄𝗶𝗻𝘀 𝘄𝗶𝘁𝗵 𝗲𝗮𝘀𝗲! A terrific performance from PV Sindhu to defeat Kristin Kuuba in her final group game to move one step closer to Olympic glory for the third time. She won her match in straight games, 21-05 & 21-10.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
🏸 Kristin had no answer to Sindhu's… pic.twitter.com/9TJr9mZ2Ko
🇮🇳🔥 𝗟𝗔𝗞𝗦𝗛𝗬𝗔 𝗛𝗔𝗦 𝗗𝗢𝗡𝗘 𝗜𝗧! What a performance from Lakshya Sen against World No. 4, Jonatan Christie as he moves into the round of 16 in his maiden Olympic campaign. He won the match in straight games, 21-18 & 21-12.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
🏸 After a slow start to the match, Lakshya Sen… pic.twitter.com/DEvk5btFGW
టేబుల్ టెన్నిస్‌లో రికార్డ్ కానీ అంతలోనే
యంగ్ ప్లేయర్లు మనీకా బాత్రా, ఆకుల శ్రీజ బుధవారం రికార్డు సృష్టించారు. మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ వేర్వేరు పోటీల్లో మనీకా, శ్రీజ విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లుగా రికార్డు సృష్టించారు. మనికా బాత్ర 4-0 తేడాతో నెగ్గగా, తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ సెర్బియన్ ప్లేయర్ జియాన్ జెంగ్పై 4-2 తేడాతో నెగ్గింది.
అయితే టేబుల్ టెన్నిస్‌లో రికార్డు సృష్టించిన మనికా బాత్ర ప్రీ క్వార్టర్స్‌లో నిరాశ పర్చింది. రౌండ్ 16లో మ్యూ హిరానో (జపాన్)తో పోటీపడ్డ మనికా బాత్ర 4-1 తేడాతో ఓడింది.
🇮🇳🔥𝗪𝗵𝗮𝘁 𝗮 𝘄𝗶𝗻 𝗳𝗼𝗿 𝗦𝗿𝗲𝗲𝗷𝗮! Sreeja Akula records a fine victory against 🇸🇬's Jian Zeng to become only the second Indian female paddler to make it to the round of 16 in the Olympics.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
🏓 After narrowly losing the first game to Jian Zeng, Sreeja managed to swing the… pic.twitter.com/oLFDtzmttl
ఫైనల్‌కు స్వప్నిల్
పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 590-38x పాయింట్లతో క్వాలిఫైయర్‌లో 7వ స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించాడు. ఆగస్టు 01న స్వప్నిల్ ఫైనల్లో ఆడనున్నాడు. మరోవైపు ఇదే ఈవెంట్లో షూటర్ ఐశ్వరీ ప్రతాప్ 589-33x పాయింట్లతో 11వ స్థానం దక్కించుకున్నాడు.
🇮🇳🔥 𝗟𝗔𝗞𝗦𝗛𝗬𝗔 𝗛𝗔𝗦 𝗗𝗢𝗡𝗘 𝗜𝗧! What a performance from Lakshya Sen against World No. 4, Jonatan Christie as he moves into the round of 16 in his maiden Olympic campaign. He won the match in straight games, 21-18 & 21-12.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
🏸 After a slow start to the match, Lakshya Sen… pic.twitter.com/DEvk5btFGW
పతకానికి దగ్గరలో లవ్లీనా
స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల 75 కేజీల విభాగంలో రౌండ్ 16 మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. నార్వే బాక్సర్ సునీవాపై 5-0 తేడాతో అలవోకగా విజయం సాధించింది. ఆగస్టు 4న లి కియాన్ (చైనా)తో జరిగే క్వార్టర్స్‌లో లవ్లీనా గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది.
🇮🇳 𝗙𝗮𝗻𝘁𝗮𝘀𝘁𝗶𝗰 𝘄𝗶𝗻 𝗳𝗼𝗿 𝗟𝗼𝘃𝗹𝗶𝗻𝗮! Olympic Bronze medallist, Lovlina Borgohain gets off to a fine start in her Olympic campaign as she wins her round of 16 bout against Sunniva Hofstad.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
🥊 A win in her next bout will assure a medal for India.
⏰ She will next… pic.twitter.com/6EGI5tIdmc
ఆర్చరీలో దీపిక మార్క్
దీపికా కుమారి ఆర్చరీ సింగిల్స్ ఈవెంట్లో వరుస విజయాలు నమోదు చేసింది. మొదట రీనా పర్నత్పై నెగ్గి రౌండ్ 32కు అర్హత సాధించింది. అనంతరం రౌండ్ 32లో ప్రత్యర్థి క్విని రోఫిన్పై 6-2 తేడాతో గెలిచింది. దీంతో దీపిక రౌండ్ 16కు క్వాలిఫై అయ్యింది.
క్వార్టర్స్‌కు హాకీ టీమ్
భారత హాకీ టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బెల్జియంపై ఆస్ట్రేలియా విజయం సాధించడం వల్ల భారత్‌కు క్వార్టర్స్ బెర్తు ఖరారైంది. కాగా, ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఇప్పటిదాకా 12 పతకాలు సాధించింది. మరోవైపు అన్షు అగర్వాలా ఈక్విస్ట్రియన్ (గుర్రపు స్వారీ)లో నిరాశ పర్చాడు. బుధవారం జరిగిన డ్రెస్సింగ్ ఈవెంట్లో అన్షు విఫలమయ్యాడు.
లక్ష్యసేన్ రివర్స్ షాట్- ఈ షట్లర్ స్కిల్‌కు అడియెన్స్ ఫిదా- వీడియో వైరల్ - Paris Olympics 2024