Paris Olympics India: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు కాంస్యాలు మాత్రమే చేరాయి. అవన్నీ షూటింగ్లో రావడం విశేషం. రీసెంట్గా శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లో త్రుటిలో భారత్‌కు మరో కాంస్యం దూరమైంది. ఇక ఆదివారం (ఆగస్టు 4) భారత్ నుంచి మేజర్ ఈవెంట్లలో పలువురు అథ్లెట్లు పోటీపడుతున్నారు. అందులో రెండు ఈవెంట్లలో మన అథ్లెట్లు పతకానికి అడుగు దూరంలో ఉన్నారు. దీంతో ఆదివారం అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసి పతకాల సంఖ్య పెంచాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అందరి కళ్లు లక్ష్యవైపే
భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుత క్రీడల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో అజేయంగా సెమీస్‌కు దూసుకొచ్చిన లక్ష్య ఆదివారం మరో కీలక పోరుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ నెగ్గి పసిడి పోరుకు అర్హత సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బ్యాడ్మింటన్లోనైనా పతకం రంగు మారాలని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ వరల్డ్ నెం.2 విక్టర్ ఆక్సెల్సెన్ (డెన్మార్క్)తో తలపడనున్నాడు. ఈ పోరు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.
లవ్లీనాపై ఆశలెన్నో
మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గొహెయిన్ ఆదివారం క్వార్టర్ ఫైనల్స్ ఆడనుంది. ఆమె లి క్వియాన్ (చైనా)తో 75కేజీల బాక్సింగ్‌లో తలపడనుంది. గంపెడన్ని ఆశలతో లవ్లీనా ఈ మ్యాచ్‌లో బరిలో దిగనుంది. మరో మ్యాచ్ నెగ్గితే లవ్లీనాకు దాదాపుగా పతకం దక్కే ఛాన్స్ ఉంది. ఇక రీసెంట్గా జరిగిన మరో ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్ జరిన్ ఓడడం వల్ల బాక్సింగ్‌లో లవ్లీనాపైనే అందరు ఆశలు పెట్టుకున్నారు.
హాకీ క్వార్టర్స్‌లో
విశ్వక్రీడల్లో భారత్ పతకం ఆశించే ఈవెంట్లలో హాకీ ఒకటి. ఈసారి పురుషుల హాకీ జట్టు కూడా అందుకు తగ్గట్లుగానే ప్రదర్శన చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. ఈరోజు గ్రేట్ బ్రిటన్ జట్టుతో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో భారత్ జోరు కొనసాగితే పతకాల సంఖ్య పెరగడం పక్కా!
ఆగస్టు 4 మరికొన్ని ఈవెంట్లు
- గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే (శుభాంకర్, గగన్‌జీత్)- మధ్యాహ్నం 12.30
- అథ్లెటిక్స్: మహిళల 3000మీ.స్టీపుల్‌ఛేజ్ తొలి రౌండ్ (పారుల్)- మధ్యాహ్నం 1.35, పురుషుల లాంగ్‌జంప్ క్వాలిఫికేషన్ (జెస్విన్ అల్డ్రిన్)- మధ్యాహ్నం 2.30
- షూటింగ్: పురుషుల 25మీ.ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫికేషన్ (విజయ్‌వీర్, అనీశ్)- మధ్యాహ్నం 12.30, స్కీట్ మహిళల క్వాలిఫికేషన్ (రైజా, మహేశ్వరి)- మధ్యాహ్నం 1
- సెయిలింగ్: డింగీ రేస్ పురుషులు (విష్ణు)- మధ్యాహ్నం 3.35, మహిళలు (నేత్ర)- సాయంత్రం 6.05
🗓 𝗗𝗮𝘆 𝟵 𝗮𝗻𝗱 𝘀𝗼𝗺𝗲 𝗰𝗿𝘂𝗰𝗶𝗮𝗹 𝗴𝗮𝗺𝗲𝘀 𝗹𝗶𝗻𝗲𝗱 𝘂𝗽! As we move on to day 9 of #Paris2024, here are some key events lined up for tomorrow 👇
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 3, 2024
🏑 A huge day awaits the Indian men's hockey team as they face Great Britain in a must-win quarter-final match to keep… pic.twitter.com/SEgGl8LcC6
'భోజనం చేయలేదు, నీరు తాగలేదు'- ఒలింపిక్స్ ఓటమిపై నిఖత్ ఎమోషనల్ - Paris Olympics 2024