Paris Olympics 2024 Top Perfomances : పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రపంచ దేశాల అథ్లెట్లు కష్టపడి తమ దేశానికి పతకాలను అందిస్తున్నారు. అయితే ఈ ఒలింపిక్స్ బరిలో దిగిన ఓ నలుగురు అథ్లెట్లు మాత్రం తీవ్ర మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదురొడ్డి దేశానికి మెడల్స్‌ను అందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తగ్గేదేలే అని నిరూపించారు. మరి ఈ పారిస్ ఒలింపిక్స్‌లో ఎందరో యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచిన ఆ నాలుగు ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం పదండి.
నాడా హఫీజ్ - దేశానికి పతకాన్ని అందించాలనే సంకల్పం గర్భంతో ఉన్న ఆమెను ఒలింపిక్స్‌లో పాల్గొనేలా చేసింది. ఈ ఈజిప్టు ఫెన్సర్ ఏడు నెలల గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంది. ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్ స్కీపై ఓపెనింగ్ మ్యాచ్ లో 15-13 స్కోరుతో విజయం సాధించింది. అయితే హఫీజ్ తర్వాత రౌండ్ ఆఫ్ 16లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో 15-7 తేడాతో ఓడిపోయింది. కానీ బలమైన పోటీ ఇచ్చింది. మ్యాచ్ అనంతరం హఫీజ్ తన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి గర్విస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. "పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి వారు ముగ్గురు! అది నేను, నా ప్రత్యర్థి, ఇంకా మా ప్రపంచంలోకి రాబోయే, నా లిటిల్ బేబీ! నా బిడ్డ, నేను ఫిజికల్, ఎమోషనల్ ఛాలెంజెస్ ను కలిసి ఎదుర్కొన్నాం." అని పోస్ట్ లో తెలిపింది.
Breaking ‼️
— Rajesh Kumar (@rajeshr58261965) August 3, 2024
Nada Hafez, the seven-months pregnant woman who stole all hearts at #Olympics 2024
Women are the strongest creatures on the earth. Regardless of the situation bad or good they always give their best !! There exists a different power and strength in them. #Paris2024 pic.twitter.com/1uGKk8Zts1
Merhaba Yosuf Dikec🥈 Silver medalist pic.twitter.com/ZZP6AcjvoZ
— Hussain Ansari (@HussainAns786) August 3, 2024
గోల్డ్ మెడలిస్ట్‌కు ఐఫోన్ గిఫ్ట్- లైఫ్ టైమ్ గ్రిల్ చికెన్ ఫ్రీ! - Paris Olympics 2024
10గంటల్లో 4.6కేజీలు తగ్గిన అమన్- లేకుంటే మళ్లీ అది రిపీట్ అయ్యేదే! - Paris Olympics