Paris Olympics 2024 Swapnil Kusale Double Promotion : పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్ లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒలింపిక్ పతక విజేతకు ప్రోత్సాహకంగా సెంట్రల్ రైల్వే పదోన్నతి కల్పించింది. స్వప్నిల్‌ను టీటీఈ నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్ డీ)గా నియమిస్తూ ప్రమోషన్ ఆర్డర్‌ను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇకపై కుసాలే ముంబయిలోని స్పోర్ట్స్ సెల్‌కు ఓఎస్‌డీగా వ్యవహించనున్నాడు.
9 ఏళ్ల తర్వాత ప్రమోషన్ - స్వప్నిల్ తొమ్మిదేళ్లుగా సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఎన్ని సార్లు ప్రమోషన్‌కు అప్లై చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని అతడి కోచ్ దీపాలి దేశ్ పాండే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రైల్వే శాఖ నిర్ణయం పట్ల స్వప్నిల్ నిరాశ చెందాడని ఆమె ఆరోపించారు. 'స్వప్నిల్ ప్రమోషన్ ఫైల్‌ను ఉన్నతాధికారుల పరిశీలనకు పంపేందుకు అతడిని ఆఫీసులో రిపోర్టు చేయమని రైల్వే అధికారులు అడిగారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు శిక్షణలో బిజీగా ఉండడం వల్ల స్వప్నిల్ రైల్వే కార్యాలయానికి వెళ్లలేకపోయాడు.' అని దీపాలి దేశ్ పాండే తెలిపారు.
రెండు రోజుల్లో డబుల్ ప్రమోషన్ - ఒలింపిక్ పతక విజేత స్వప్నిల్ కుసాలేకు రెండు రోజుల్లో డబుల్ ప్రమోషన్ కల్పిస్తామని సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రంజిత్ మహేశ్వరి పేర్కొన్నారు. ఆయన ప్రమోషన్‌ను అడ్డుకున్నామన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా గురువారం(ఆగస్ట్ 1) జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని గెలిచాడు. ఆట ప్రారంభంలో స్వప్నిల్ కాస్త నెమ్మదించినప్పటికీ, తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో టాప్ -2లోకి దూసుకెళ్లాడు. ఇక చివర్లో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవడం వల్ల స్వప్నిల్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. స్వప్నిల్ కంటే ముందు 463.6 పాయింట్లతో లీ యుకున్ (చైనా) స్వర్ణ పతకం దక్కించుకోగా, 461.3 పాయింట్లతో కులిశ్ (ఉక్రెయిన్) రజతం గెలుచుకున్నాడు.
🇮🇳🥉 𝗧𝗿𝗶𝗽𝗹𝗲 𝗕𝗿𝗼𝗻𝘇𝗲 𝗳𝗼𝗿 𝗜𝗻𝗱𝗶𝗮, 𝘁𝗿𝗶𝗽𝗹𝗲 𝘁𝗵𝗲 𝗷𝗼𝘆!
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿 𝗲𝘅𝘁𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗰𝗼𝘃𝗲𝗿𝗮𝗴𝗲 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗮𝘁𝗵𝗹𝗲𝘁𝗲𝘀 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗣𝗮𝗿𝗶𝘀 𝗢𝗹𝘆𝗺𝗽𝗶𝗰𝘀 𝟮𝟬𝟮𝟰!
📸 Pics belong to the respective owners… pic.twitter.com/mgy6wmLrLJ