ETV Bharat / sports

మనుబాకర్​లో స్ఫూర్తి నింపిన ఆ టాటూ - దీని గురించి మీకు తెలుసా? - Paris Olympics 2024 Manu Bhaker - PARIS OLYMPICS 2024 MANU BHAKER

Paris Olympics 2024 Manu Bhaker Tattoo : టోక్యో ఒలింపిక్స్‌లో గన్​ మొరాయించి నిరాశతో వెనుదిరిగిన మను బాకర్​ ప్రస్తుతం పారిస్​ ఒలింపిక్స్​లో రెండు మెడల్స్​ సాధించి చరిత్ర సృష్టించింది. అయితే టోక్యో ఒలింపిక్స్​ తర్వాత నుంచి ఇప్పటివరకు ముందుకు సాగడానికి మను బాకర్​కు ఓ టాటూ స్ఫూర్తినిచ్చిందట. దాని గురించే ఈ కథనం.

source Associated Press
Paris Olympics 2024 Manu Bhaker Tattoo (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 3, 2024, 5:22 PM IST

Paris Olympics 2024 Manu Bhaker Tattoo : టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్​ మను బాకర్ గన్ మొరాయించిన సంగతి తెలిసిందే. ఎన్నోఅంచనాలతో టోక్యోకు వెళ్లిన ఆమెకు, కీలక సమయంలో గన్‌లో సాంకేతిక లోపం తలెత్తి సతాయించింది. దీంతో ఆమె తీవ్ర నిరాశతో పతకం లేకుండానే తిరిగొచ్చింది. పలు విమర్శల్నను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె పిస్టల్ గర్జించింది. ఏకంగా రెండు పతకాలను సాధించి సెన్సేషన్​ క్రియేట్ చేసింది.

స్ఫూర్తి నింపిన టాటూ - అయితే మను బాకర్ టోక్యో ఒలింపిక్స్​లో తనకు ఎదురైన నిరాశను గుర్తు చేసుకుంది మను.​ ఆ సమయంలో తనలో స్ఫూర్తి నింపిన విషయం గురించి తెలిపింది. తన మెడ వెనుక భాగంలో ఉన్న స్టిల్ ఐ రైజ్ టాటూ గురించి వివరించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకుండా, తనలో తాను స్ఫూర్తిని నింపుకునే ఉద్దేశంతోనే ఈ టాటూను వేయించుకున్నట్లు వివరించింది. ఈ టాటూను ప్రైవేట్​గా ఉంచుకోవడానికే మెడా వెనక భాగంపై వేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

"టోక్యో గతం. జీవితంలో ముందుకెళ్లడానికి నన్ను మోటివేట్ చేసేది స్టిల్ ఐ రైజ్​ కొటేషన్. క్రీడాకారుల జీవితంలో విజయాలు, వైఫల్యాలు అనేది ఒక భాగం. కానీ, అపజయాలను ఏ విధంగా తీసుకుని, తిరిగి ఎలా పుంజుకుంటామనేది ఎంతో ముఖ్యం. స్టిల్ ఐ రైజ్ అనేవి కేవలం పదాలు మాత్రమే కావు. మీరు పరాజయాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా మీ విలువను నిరూపించే నినాదం ఇది.

ఈ పదాలే నాకు గొప్ప ప్రేరణ. ఇది నాకు దృఢ సంకల్పాన్ని అందిస్తాయి. ఎన్నికష్టాలు, పరాజయాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి నేను పైకి లేస్తాననే ఆత్మవిశ్వాసాన్ని నాలో కలిగిస్తాయి. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత రోజులు భారంగా గడిచాయి . కానీ, మళ్లీ నేను తిరిగి పుంజుకుంటాననే ఆత్మవిశ్వాసం నాలో ఉంది. అందుకే స్టిల్ ఐ రైజ్ పదాలను నా కెరీర్‌కు ఆపాదించాను. ఆ పదాలు నాకు గొప్ప ప్రేరణగా, స్ఫూర్తిగా నిలిచాయి. అందుకే వాటిని టాటూగా వేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ అది కనపడేలా వేసుకోవాలని అనుకోలేదు. అందుకే మెడ వెనక భాగంపై వేసుకున్నాను." అని మను చెప్పింది. కాగా, ఈ కొటేషన్​ను పౌర హక్కుల కార్యకర్త, అమెరికా కవి మాయా ఆంజెలు రాశారు.

'అలా జరగడం నచ్చలేదు - ఒత్తిడికి గురయ్యాను!' - మూడో పతకం మిస్​ అవ్వడంపై మను బాకర్ - Paris Olympics 2024

క్యాన్సర్‌తో పోరాడి ఒలింపిక్స్​ బరిలోకి దిగి - Pairis Olympics 2024 Chou tien chen

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.