Paris Olympics 2024 Sarabjot Singh : అథ్లెట్ జీవితంలో గాయాలు, కష్టాలు సర్వసాధారణం. ఇలాంటి ఒక దశ పారిస్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సరబ్‌జోత్ సింగ్ జీవితంలోనూ ఎదురైంది. కాంపిటీషన్‌లో 60 సార్లు కాదు, ఒక్కసారి కూడా తన పిస్టల్‌ను పైకెత్తలేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అలాంటిది ఇప్పుడు ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన సరబ్‌జోత్, అతని కోచ్ అభిషేక్ రానాకు గురువారం మధ్యాహ్నం దిల్లీలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా సరబ్‌జోత్ తన జర్నీ గురించి మాట్లాడాడు. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్‌కు చాలా దూరంగా ఉన్న సందర్భం నుంచి నేషనల్ ట్రయల్స్‌లో పాల్గొనడం, పారిస్‌లో పతకం గెలవడం వరకు తన జర్నీని వివరించాడు సరబ్.
- పిస్టల్ కూడా ఎత్తలేకపోయా
క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా ఆధ్వర్యంలో సరబ్‌జోత్ సింగ్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సరబ్‌జోత్ మాట్లాడుతూ,
"గత ఏడాది మార్చిలో జరిగిన భోపాల్ ప్రపంచకప్ తర్వాత, నేను షూటింగ్ చేసే చేతికి షోల్డర్ ప్రాబ్లమ్ ఎదురైంది. నా చేతికి ఎత్తి షాట్ కూడా చేయలేకపోయాను." అని అన్నాడు.
"నేను వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో పోటీ చేయలేకపోయాను. ఛటౌరోక్స్‌లోని ఒలింపిక్ క్రీడల శిబిరాన్ని విడిచిపెట్టాను. PRP (ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా థెరపీ) చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆసియా క్రీడలకు ముందు నేను స్టెరాయిడ్లను అధిక మోతాదులో తీసుకోవలసి వచ్చింది."
"నేను హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించాను. పురుషుల జట్టు కేటగిరీలో స్వర్ణం మిక్స్‌డ్ టీమ్‌లో రజతం గెలిచాను. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని చాంగ్‌వాన్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ గేమ్స్ కోటాను గెలుచుకున్నాను. రెగ్యులర్ ఫిజియోథెరపీ కారణంగా, నొప్పి క్రమంగా తగ్గడం ప్రారంభించింది. నేను నా షూటింగ్‌కు తిరిగి రాగలిగాను". అని అన్నాడు. కాగా, సరబ్ షోల్డర్ బ్లేడ్, కాలర్‌బోన్ ఒకదానితో ఒకటి రాసుకోవడం వల్ల సమస్య తలెత్తింది. దీంతీ తీవ్రమైన నొప్పిని అతడు అనుభవించాడు. టార్గెట్ ఉన్న ఎత్తులోకి పిస్టల్‌ను ఎత్తలేకపోయేవాడు.
- ఒలింపిక్ కల చేజారిపోతున్నట్లు అనిపించింది?
2016 నుంచి సరబ్‌జోత్ కోచ్‌గా ఉన్న అభిషేక్ రాణా మాట్లాడుతూ, "ఒకానొక సమయంలో ఒలింపిక్ కల జారిపోతున్నట్లు అనిపించింది. మేము చాలా కష్టపడి శిక్షణ పొందాం. ఆపై అతడికి ఈ గాయం ఎదురైంది. చాలా నిస్సహాయంగా భావించాం. ఏమి చేయాలో అర్థం కాలేదు. మూడు నెలల పాటు సరబ్‌జోత్ భుజానికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలని చెప్పారు. ఈ సమయంలో, పూర్తిగా మానసిక శిక్షణపై దృష్టి పెట్టాం. క్రమంగా సరబ్‌జోత్ ఫిజికల్ ట్రైనింగ్ చేయడం మొదలు పెట్టాడు. అతడు ఐదు షాట్లు తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకునేవాడు. తర్వాత మరో పది సాట్లు, తర్వాత విరామం. ఇలా నెమ్మదిగా వేగం పుంజుకున్నాడు’ అని తెలిపాడు.
- తప్పులు మళ్లీ చేయను
తాను మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్‌లో రజతం లేదా బంగారు పతకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానని సరబ్ చెప్పాడు. అయితే పేలవమైన షాట్లు ఎందుకు చేశానో అర్థం కాలేదని అన్నాడు. "నేను నా బలహీనతలను అధిగమించేందుకు కృషి చేస్తాను. మరోసారి తప్పులు రిపీట్ చేయను." అని పేర్కొన్నాడు.
ఒలింపిక్స్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పతకాన్ని కోల్పోయిన రోజు సరబ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రాణించాలని మరింత బలంగా నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. సిద్ధం కావడానికి కేవలం ఒక రోజు మాత్రమే ఉన్నందున, పిస్టల్‌ను పట్టుకుని చాలా గంటలు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ‘ఉదయం నా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మ్యాచ్ ముగిసిన తర్వాత, నేను సాయంత్రం వేదికకు తిరిగి వచ్చి 3-4 గంటల పాటు పిస్టల్ పట్టుకుని సాధన చేశాను. మరో పతకం చేజారిపోకూడదని నేను బలంగా నిశ్చయించుకున్నాను’ అని వివరించాడు.
క్వార్టర్ ఫైనల్‌కు లక్ష్యసేన్ - సాత్విక్, చిరాగ్ జోడీ, నిఖత్‌కు షాక్! - PARIS OLYMPICS 2024
'ప్లీజ్ తినడానికి ఏమైనా ఇవ్వండి' - భారత ఒలింపిక్ విన్నర్ సరబ్ జోత్ - Paris Olympics 2024