Paris Olympics 2024 Neeraj Chopra : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ దక్కింది. గురువారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో నీరజ్ చోప్రా కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ తుది పోరులో పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ 92 మీటర్లతో స్వర్ణం సాధించగా, నీరజ్ 89.45 మీటర్లతో సిల్వర్‌ను సొంతం చేసుకున్నాడు.
దీంతో నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు తన ప్రదర్శనపై నీరజ్ చోప్రా స్పందించాడు. తన ఆటను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
"దేశానికి మెడల్ అందించినందుకు ఆనందంగానే ఉంది. కానీ నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. కచ్చితంగా దీనిపై సమీక్షించుకుంటాను. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. జావెలిన్ త్రో గట్టి పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ కూడా తనదైన రోజున అదరగొడతాడు. ప్రస్తుతం ఇది అర్షద్ డే. అయినా నేను కూడా వంద శాతం కష్టపడ్డాను. కానీ మరికొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. మన జాతీయ గీతం వినిపించ లేకపోయినందుకు ఎంతో బాధగా ఉంది. కచ్చితంగా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాను." అని నీరజ్ అన్నాడు.
గర్వంగా ఉంది - "గత ఏడాది కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందు నీరజ్ గాయపడ్డాడు. ఈ కారణంగా పోటీలకు దూరమయ్యాడు. అనంతరం తీవ్రంగా శ్రమించి మరీ మళ్లీ ఈటెను పట్టుకున్నాడు. ఇప్పుడు మెడల్‌ను ముద్దాడాడు. దీనిపై నీరజ్ తండ్రి సతీశ్ స్పందించారు. ‘‘దేశం కోసం నీరజ్ కాంస్య పతకం గెలిచాడు. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. గర్వంగా ఫీల్ అవుతున్నాం. అతడు యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతం ఆ గాయం తీవ్రత కూడా నీరజ్ ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపించిందేమో. లేకపోతే మరింత మెరుగైన ప్రదర్శన చేసేవాడు." అని చెప్పుకొచ్చారు.
ఇష్టమైన ఆహారం పెడతా - "నా కొడుకు సిల్వర్ మెడల్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు కూడా కుమారుడి లాంటివాడే. నీరజ్ ప్రదర్శన చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చాక అతడికిష్టమైన వంటకాలను వండిపెడతాను" అని నీరజ్ తల్లి సరోజ్ దేవి పేర్కొన్నారు. "నా మనవడు సిల్వర్ మెడల్ సాధించడం ఆనందంగా ఉంద"ని నీరజ్ తాత ధరమ్ సింగ్ చోప్రా అన్నారు.
బంగారుకొండకు వెండి దండ - నీరజ్ చోప్రా సెన్సేషనల్ రికార్డ్ - PARIS OLYMPICS 2024
'దేశం మొత్తం గర్విస్తోంది' - బల్లెం వీరుడికి ప్రధాని మోదీ అభినందనలు - Neeraj Chopra Modi