Paris Olympics 2024 Manu Bhaker : ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పతకాల వేటలో అథ్లెట్లు తమ ప్రతిభను చూపిస్తూ ముందుకెళ్తున్నారు. అలా తాజాగా భారత షూటర్ మను బాకర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత అథ్లెట్‌గా నిలిచింది.
మొదట 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఉమెన్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకుంది మను బాకర్. అనంతరం ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో పతకం సాధించింది. ఈ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్ జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని అందుకుంది. సౌత్ కొరియాతో పోటీ పడి ఈ మెడల్‌ను సంపాదించుకుంది. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరినట్టైంది.
తొలి భారత అథ్లెట్ - అయితే మను బాకర్ కన్నా ముందు సింగిల్ ఎడిషన్‌లోనే రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్ నార్మన్ ప్రిచార్డ్. ఈయన 1900 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. అప్పుడు ఇండియాలో బ్రిటీష్ కొలోనియల్ రూల్ ఉండేది. అప్పుడు ఆయన 200మీ, 200మీ హర్డిల్స్‌లో రెండు రజత పతకాలను ముద్దాడారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారట. అయితే ఆయన సాధించిన మెడల్స్‌ను భారత ఖాతాలోనే లెక్కించారట. అలా ఆయన ఒకే ఎడిషన్‌లో రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచారు.
ఒకే ఎడిషన్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి మహిళ ఎవరంటే? - యూకేకు చెందిన ఫిగర్ స్కేటర్ మాడ్జ్ సియర్స్ ఒకే ఎడిషనల్లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళగా నిలిచారు(two medals in Same olympics first women). 1908లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో ఈమె విమెన్స్ ఫిగర్ స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో పాటు అదే ఒలింపిక్స్‌లో భర్తతో కలిసి పెయిర్స్ స్కేటింగ్‌లోనూ బ్రాంజ్ మెడల్‌ను అందుకుంది.
In 1902, Madge Syers became the first woman to compete at the World Figure Skating Championships. She beat two men for the silver medal.
— The New York Times (@nytimes) April 28, 2022
The following year, the International Skating Union barred women from the competition.https://t.co/xfRJeBei3C pic.twitter.com/f6AILHk9Km
భారత్ ఖాతాలో మరో మెడల్ - స్వాతంత్ర్యం తర్వాత మరోసారి ఇలా - Paris Olympics 2024 Shooting
మను బాకర్‌కు అరుదైన గౌరవం - ఆ సింబల్‌కు అర్థం ఏంటంటే? - Manu Bhaker Eiffel Tower Badge