Paris Olympics Rings and colours Meaning : నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మకంగా జరిగే ప్రపంచ క్రీడా వేడుక ఒలింపిక్స్ ఈ ఏడాది పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
- ప్రతీసారి ఒలింపిక్ క్రీడలు ప్రారంభ సమయానికి 100 రోజుల ముందు సంప్రదాయంగా గ్రీస్‌లోని ఒలింపియాలో ఒలింపిక్ టార్చ్‌ను వెలిగిస్తారు. క్రీడలు ముగిసే వరకు ఈ ఒలిపింక్ టార్చ్ వెలుగుతూనే ఉంటుంది.
- మొదటిసారి ఒలింపిక్స్‌ను క్రీస్తుపూర్వం 776లో గ్రీకు సంప్రదాయాల్లో జరిగేవి. దాదాపు ఆరు నెలలపాటు కొనసాగేవి. ఈ పోటీల్లో బాక్సింగ్, రెజ్లింగ్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, డిస్కస్, రథాల పోటీలు ఉండేవి.
- అయితే క్రీస్తుశకం 393లో పలు కారణాల వల్ల ఈ ఒలింపిక్ పోటీలపై నిషేధం విధించారు. మళ్లీ 1500 ఏళ్ల తర్వాత మోడ్రన్ ఒలింపిక్స్ పేరుతో 1896లో ప్రారంభించారు.
- మొదట్లో సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించిన సంవత్సరమే వింటర్ ఒలింపిక్స్ నిర్వహించేవారు. కానీ ఇప్పుడు సమ్మర్ ఒలింపిక్స్ పూర్తైన రెండేళ్ల తర్వాత వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్నారు.
- సమ్మర్, వింటర్ ఒలింపిక్సే కాదు దివ్యాంగుల కోసం పారాఒలింపిక్స్ కూడా నిర్వహిస్తారు. 15 నుంచి 18 ఏళ్ల వరకు ఉండే వాళ్ల కోసం యూత్ ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తారు.
Marvelling at the incredible beauty of the Olympic Rings on the Eiffel Tower. A sight that perfectly captures the grandeur of the event in front of us!
— Team India (@WeAreTeamIndia) July 25, 2024
As we approach the Opening Ceremony tomorrow, let us support our athletes loud and proud. #JeetKiAur | #Cheer4Bharat pic.twitter.com/j4lS3bzBWF - ఒకప్పుడు రైటర్స్, శిల్పులు, పెయింటర్స్, ఆర్కిటెక్చర్స్, మ్యూజిషియన్స్ కూడా ఈ ఒలింపిక్స్‌లో పోటీపడేవారు. కానీ 1948 తర్వాత వీటిని ఆపేశారు.
- పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ఇచ్చే గోల్డ్ మెడల్‌ను పూర్తి బంగారంతో ఇచ్చేవారు. కానీ ఇది 1912 వరకే. ఆ తర్వాత పతకంలో బంగారం కేవలం 6 గ్రాములే ఉంటుంది. మిగతాదంతా వెండి లేదా రిసైకిల్ చేసిన మెటల్స్ ఉంటాయి.
- ఇకపోతే మెడల్స్ సాధించిన వారు దాన్ని కొరుకుతూ ఫొటోలకు పోజులిస్తుంటారు. ఎందుకంటే నిజానికి అప్పట్లో మెడల్ బంగారంతో చేసిందేనా కాదా అని పరీక్షించడానికి అలా చేసేవారు. అనంతరం అదో సంప్రదాయంగా మారిపోయింది.
- ఇకపోతే చెప్పుకోవాల్సింది ఒలింపిక్ లోగోలో ఉండే ఐదు రింగులు, రంగులు గురించి. రింగులు - ఓషియానా, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాలకు ప్రతీక. ఇక ప్రతి దేశపు జాతీయ పతాకంలో ఉండే రంగులే ఈ నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు.
చీరకట్టులో పీవీ సింధు - ఓపెనింగ్ సెర్మనీలో భారత అథ్లెట్లు ట్రెడిషనల్ వేర్ - Paris Olympics 2024