ETV Bharat / sports

రెండు ఒలింపిక్ పతకాలు - మను కన్నా ముందు వీరిదే ఆ ఘనత! - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

PARIS OLYMPICS 2024 : ఒలింపిక్ పతకాల వేటలో భారత్ దూసుకెళ్తోంది. భారత యువ షూటర్ మను బాకర్ ఒకే ఒలింపిక్స్​లో రెండు పతకాల సాధించి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఒలింపిక్స్​లో రెండు మెడల్స్ గెలిచిన భారత అథ్లెట్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

source ANI and Associated Press
PARIS OLYMPICS 2024 (source ANI and Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 10:54 PM IST

PARIS OLYMPICS 2024 Indian Athetes Two Medals : పారిస్ ఒలింపిక్స్ పతకాల వేటలో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. భారత యువ షూటర్ మను బాకర్ స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్​లో రెండు మెడల్స్​ సాధించిన భారత మహిళా అథ్లెట్​గా నిలిచింది. ఈ క్రమంలో వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన భారత్ అథ్లెట్ల గురించి తెలుసుకుందాం.

1. సుశీల్ కుమార్
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వ్యక్తిగత విభాగంలో రెండు సార్లు ఒలింపిక్ పతకాలను సాధించాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్​లో రెజ్లింగ్​లో సుశీల్ కుమార్ కాంస్య పతకం అందుకున్నాడు. అలాగే 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం సాధించాడు. అయితే 2021లో జరిగిన ఓ ఘటన సుశీల్ కుమార్ రెజ్లింగ్ కెరీర్​ను దెబ్బతిసింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్​ను హత్య చేశారని సుశీల్ కుమార్​ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ తిహాడ్ జైలులో ఉన్నారు.

2. పీవీ సింధు
భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌ లో రజత పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్‌లో భారత్​కు రజత పతకం రావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో సింధు కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సారి పారిస్ ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో పతకం గెలిచి మూడో సారి ఒలింపిక్ విజేతగా నిలవాలని ప్రయత్నిస్తోంది.

3. మను బాకర్
భారత స్టార్ షూటర్ మను బాకర్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్​లో రెండు పతకాలను గెలుచుకుంది. దీంతో ఒకే ఒలింపిక్స్​లో రెండు పతకాల గెలిచిన భారత అథ్లెట్​గా రికార్డు సృష్టించింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్​లో ఇప్పటికే కాంస్య పతకాన్ని అందుకోగా, మంగళవారం జరిగిన మిక్స్​డ్​ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో సరబ్ జోత్​ సింగ్​తో కలిసి దక్షిణ కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని మట్టికరిపించి మరో కాంస్య పతకాన్ని ముద్దాడింది. దీంతో మను బాకర్ ఖాతాలో రెండు పతకాలు పడ్డాయి. అలాగే ఆగస్టు 2న మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌ క్వాలిఫికేషన్ రౌండ్ జరగనుంది. ఈ రౌండ్ లో క్వాలిఫై అయితే మరో పతకం మను బాకర్ ఖాతాలో చేరుతుంది. అప్పుడు ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలను సాధించిన అథ్లెట్​గా మను చరిత్ర సృష్టించనుంది.

ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో పోటీ - ఆమె పోరాటానికి ప్రతిఒక్కరూ ఫిదా! - 2024 Paris Olympics

ఒలింపిక్స్​లో మను బాకర్​ విజయాల వెనక రానా - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.