Paris Olympics 2024 Indian shooter Swapnil Kusale : మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామానికి చెందిన షూటర్, స్వప్నిల్ కుసాలే(29) పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా నిలిచాడు. 2012 నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న కుసాలే, ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసేందుకు ఏకంగా పన్నెండేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
కుసాలే క్వాలిఫికేషన్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో టాప్ 8లో ఉన్న అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఆగస్టు 1న గురువారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో కుసాలే తలపడనున్నాడు. ఈ పోరులో మొదటి మూడు పొజిషన్స్‌లో చోటు దక్కించుకోగలిగితే స్వప్నిల్ కల నెరవేరుతుంది. భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది.
- ధోనీ స్ఫూర్తితో
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి కుసాలే స్ఫూర్తి పొందాడు. రైల్వే టిక్కెట్ కలెక్టర్‌గా ధోనీ కెరీర్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలుసు. అలానే 2015 నుంచి సెంట్రల్ రైల్వేస్‌లో కుసాలే(Ticket Collector Swapnil Kusale) పని చేశాడు. ప్రశాంతత, సహనం క్రికెట్, షూటింగ్‌కు చాలా అవసరమని, ఆ లక్షణాలు ధోనీని చూసి నేర్చుకున్నానని కుసాలే పేర్కొన్నాడు. ‘నేను షూటింగ్ ప్రపంచంలో ఎవరినీ ప్రత్యేకంగా అనుసరించను. నేను ధోనీని ఆరాధిస్తాను. అతను మైదానంలో ఉన్నంత ప్రశాంతంగా, ఓపికగా ఉండటం నా క్రీడకు అవసరం. నేను కూడా అతనిలాగే టిక్కెట్ కలెక్టర్‌ని కాబట్టి, అతని స్టోరీకి రిలేట్ అవుతాను.’ అని తెలిపాడు. - ఫైనల్‌కు ఎలా చేరాడంటే?
క్వాలిఫికేషన్ రౌండ్‌లో, చెక్ రిపబ్లిక్‌కు చెందిన అతని ఇద్దరు ప్రత్యర్థులు జిరి ప్రివ్రత్స్కీ, పీటర్ నింబుర్స్కీ కూడా 590 స్కోర్ చేశారు. అయితే కుసాలే ప్రోన్‌లో 197, స్టాండింగ్‌లో 195, నీలింగ్‌లో 195, మొత్తం 38 ఇన్నర్ 10లతో షాట్ చేశాడు. చెక్ షూటర్ల కన్నా ఎక్కువ ఇన్నర్ షాట్స్ ఉండటంతో ఏడో స్థానంలో నిలిచాడు. జిరి ప్రివ్రత్స్కీ, పీటర్ నింబుర్స్కీ చివరి పొజిషన్ ఎనిమిదిలో నిలిచారు.
తన ప్రదర్శన గురించి కుసాలే మాట్లాడుతూ, ‘ప్రతి షాట్ కొత్త షాట్. నేను ఓపికగా ఉండేందుకు ప్రయత్నించాను. మ్యాచ్ మొత్తం నాది అదే ఆలోచన. ఓపికతో షూట్ చేయాలి. మైండ్‌లో సాధారణంగా స్కోర్స్ గురించి ఆలోచిస్తుంటారు. అలా చేయకపోతే మంచిది’ అన్నాడు.
- తోటి షూటర్ల మోటివేషన్
ప్రస్తుత ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తన తోటి భారత షూటర్ మను భాకర్ విజయం కుసాలేకు మరింత మోటివేట్ చేసింది. ‘ఇప్పటి వరకు ఇది చాలా గొప్ప అనుభవం. నాకు షూటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంత కాలం చేయగలిగినందుకు ఆనందంగా ఉంది. మను రెండు పతకాలు గెలవడం చూస్తే మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆమె చేయగలిగితే మనం కూడా చేయగలం.’ అని పేర్కొన్నాడు. - విశ్వాసం వ్యక్తం చేసిన కోచ్
జాతీయ కోచ్ మనోజ్ కుమార్ ఓహ్లియన్, కుసాలే సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘అతను మంచి మానసిక స్థితిలో ఉన్నాడు. మేము బెస్ట్ రిజల్ట్ ఆశిస్తున్నాం. ఈ రోజు అతను ప్రదర్శన చేసిన విధంగానే, ఇకపై కూడా ప్రదర్శన కొనసాగించాల్సిన అవసరం ఉంది. అతను టెక్నికల్‌గా, ఫిజికల్‌గా చాలా బాగున్నాడు.’ అని ఓహ్లియన్ పేర్కొన్నాడు. - ఆదర్శవంతమైన కుటుంబం
ఇకపోతే కుసాలే కుటుంబం తమ గ్రామంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది. కుసాలే తండ్రి, సోదరుడు ఉపాధ్యాయులు. అతని తల్లి గ్రామానికి సర్పంచ్‌గా పని చేస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన కుసాలే, భారతీయ క్రీడల్లో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
50 m Rifle 3P Men's Qualification
— SAI Media (@Media_SAI) July 31, 2024
Swapnil Kusale finishes 7th with a total score of 590 and qualifies for the final.
Aishwary Pratap Singh Tomar finishes 11th with a total score of 589.
Top 8 from this round qualify for the final.
As more Indian players will play their… pic.twitter.com/rWD8k0Wvcc
ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో పోటీ - ఆమె పోరాటానికి ప్రతిఒక్కరూ ఫిదా! - 2024 Paris Olympics
భారత ఒలింపిక్స్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఇదే - మను బాకర్‌కు ఎంత ఇస్తారంటే? - Paris Olympics 2024