Paris Olympics 2024 India: పారిస్ ఒలింపిక్స్‌లో ఆదివారం పురుషుల హాకీ జట్టు విజయం మినహా, భారత్‌కు పలు ఈవెంట్లలో నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాలతో బ్యాడ్మింటన్ సెమీస్‌లో లక్ష్యసేన్, బాక్సింగ్ క్వార్టర్స్‌లో లవ్లీనా బొర్గోహెయిన్ పోరాడి ఓడారు. ఇక సోమవారం కూడా పలువురు భారత అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో బరిలోకి దిగనున్నారు.
కాంస్యం దక్కేనా?
ఆదివారం పసిడి పోరుకు అర్హత సాధించలేకపోయిన స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సోమవారం కాంస్యం కోసం బరిలో దిగనున్నాడు. అతడు మలేసియా బ్యాడ్మింటన్ ప్లేయర్ జెడ్ డె లీ తో పోటీపడనున్నాడు. ఈ మ్యాచ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో లక్ష్య గెలిస్తే అతడు తొలి ఒలింపిక్ పతకం అందుకుంటాడు. అలాగే భారత్ పతకాల సంఖ్య కూడా పెరుగుతుంది.
బరిలోకి మనికా బాత్ర, ఆకుల శ్రీజ
మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ భారత్ తరపున బరిలోకి దిగనుంది. శ్రీజతోపాటు మనికా బాత్ర, అర్చనా కామత్ ఆడనున్నారు. రౌండ్ 16లో రొమానియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో నిరాశ పర్చిన ఆకుల శ్రీజ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే భారత్ క్వార్టర్ ఫైనల్‌కు వెళ్తుంది.
సోమవారం భారత అథ్లెట్లు ఆడనున్న మరికొన్ని ఈవెంట్లు
అథ్లెటిక్స్:
- మహిళల 400మీ.పరుగు తొలి రౌండ్ (కిరణ్ పహాల్)- మధ్యాహ్నం 3.25
- పురుషుల 3000మీ.స్టీపుల్‌ఛేజ్ తొలి రౌండ్ (అవినాశ్ సాబ్లె)- రాత్రి 10.34
సెయిలింగ్:
- డింగీ రేసు మహిళలు (నేత్ర)- మధ్యాహ్నం 3.45
- పురుషులు (విష్ణు)- సాయంత్రం 6.10
రెజ్లింగ్:
- మహిళల 68 కేజీల ప్రిక్వార్టర్స్ (నిశా × సోవా)- సా।। 6.30
గోల్ఫోలోనూ నిరాశే: పారిస్ ఒలింపిక్స్‌లో గోల్ఫ్ ప్లేయర్లు శుభంకర్, గగన్‌జీత్ ఆట ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన గోల్ఫ్ ఇండివిజ్యువల్ స్ట్రోక్ ప్లే రౌండ్ 4లో వీరిద్దరూ నిష్క్రమించారు. ఈ పోటీలో శుభంకర్ 283 స్కోర్‌తో 40వ, గగన్‌జీత్ 285 పాయింట్లతో 45వ స్థానానికి పరిమితమయ్యారు. (అయితే గోల్ఫ్‌లో తక్కువ స్కోర్‌తో ఉన్న ప్లేయర్లు మెరుగైన ర్యాంక్ దక్కించుకుంటారు).
🗓 𝗗𝗔𝗬 𝟭𝟬 𝗮𝗻𝗱 𝗮 𝗰𝗵𝗮𝗻𝗰𝗲 𝘁𝗼 𝗰𝗹𝗶𝗻𝗰𝗵 𝘆𝗲𝘁 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗕𝗿𝗼𝗻𝘇𝗲! As we move on to day 10 of #Paris2024, here are some key events lined up for tomorrow 👇
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 4, 2024
🏸 An all-important Bronze medal clash for Lakshya Sen in the men's singles event. He stands a… pic.twitter.com/hNVhisqX3W
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూకుడు- ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ సాధించిందంటే? - Paris Olympics 2024