Paris Olympics 2024 Day 1 India: పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రైఫిల్ షూటింగ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో భారత్‌కు పరాభవం ఎదురవ్వగా, సింగిల్స్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో మను బాకర్ అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 2004 ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో సుమా శిరూర్ ఫైనల్‌కు చేరింది. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి.
🇮🇳 𝗗𝗿𝗲𝗮𝗺 𝘀𝘁𝗮𝗿𝘁 𝗳𝗼𝗿 𝗠𝗮𝗻𝘂 𝗕𝗵𝗮𝗸𝗲𝗿! A terrific performance from Manu Bhaker as she finishes 3rd with a total score of 580 to advance to the final in the women's 10m Air Pistol event. After initial disappointment earlier in the day, we finally have some good… pic.twitter.com/QhdEO8XNPH
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 27, 2024
🇮🇳 𝗔 𝘀𝘁𝗿𝗼𝗻𝗴 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗳𝗿𝗼𝗺 𝗛𝗮𝗿𝗺𝗲𝗲𝘁! Harmeet Desai comfortably overcomes Zaid Abo Yaman to book his spot in the round of 64. A difficult opponent awaits him in the next round in the form of Felix Lebrun. Will he defy the odds and manage to pull off… pic.twitter.com/NBwWOs0kDF
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 27, 2024
మరోవైపు బ్యాడ్మింటన్‌లో భారత అథ్లెట్లు హవా కొనసాగింది. పురుషుల సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో మన షట్లర్లు సత్తా చాటారు. తొలుత సింగిల్స్ గ్రూప్ స్టేజ్‌లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించాడు. పోటీలో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్యసేన్ 21-08తో తొలి సెట్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా 22-20తేడాతో నెగ్గి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
🇮🇳 𝗧𝗲𝗿𝗿𝗶𝗳𝗶𝗰 𝘄𝗶𝗻 𝗳𝗼𝗿 𝗟𝗮𝗸𝘀𝗵𝘆𝗮! Lakshya puts in a fine performance to overcome Kevin Cordon in his first group-stage game. Despite Kevin Cordon's fight back in the second game, Lakshya himself came back well to claim the match in straight games.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 27, 2024
⏰ Lakshya Sen… pic.twitter.com/O7mGc3FUpZ
కాగా, పురుషుల డబుల్స్‌లో భారత ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి రఫ్పాడించారు. ఫ్రెంచ్ జోడీ లుకస్- రోనమ్ను ఢీకొట్టిన సాత్విక్- చిరాగ్ ద్వయం వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించారు. 21-17, 21-14 తేడాతో ఫ్రెంచ్ జోడీని మట్టికరిపించి, గ్రూప్ స్టేజ్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఇక జులై 29న అటు సింగిల్ ఈవెంట్లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ రెండో రౌండ్ ఆడనున్నారు. ఇక టేబుల్ టెన్నిస్‌లో హర్మీత్ హర్మీత్ దేశాయ్ విజయం సాధించాడు. ప్రిలిమినరీ రౌండ్‌లో ప్రత్యర్థి జోర్డాన్‌పై 4-0 తేడాతో నెగ్గాడు.
🇮🇳 𝗦𝗮𝘁-𝗖𝗵𝗶 𝗴𝗲𝘁 𝗼𝗳𝗳 𝘁𝗼 𝗮 𝗳𝗹𝘆𝗲𝗿! Satwik & Chirag kick off their campaign with a fine win over Lucas/Ronan, despite the French duo having an overwhelming level of support from the home crowd. A good start for India's golden pair at #Paris2024.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 27, 2024
⏰ Satwik & Chirag… pic.twitter.com/OPwPOrvgVo
షూటింగ్ విభాగంలో పలు ఈవెంట్లలో భారత్‌కు నిరాశ ఎదురైంది. షూటర్ రిథమ్ సంగ్వాన్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌ల 15వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకోగా, వలరివన్- సందీప్ సింగ్ 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్‌జోత్ 9వ, అర్జున్ చీమా 18వ స్థానానికి పరిమితమయ్యారు.
క్వాలిఫయర్స్‌లో మనూ బాకర్ అదుర్స్- ఫైనల్‌కు దూసుకెళ్లిన షూటర్ - Paris Olympics 2024