Paris Olympics 2024 Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. గత టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అతడిపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సమయంలో 'నీరజ్ చోప్రా గోల్డ్ గెలిస్తే లక్కీ విన్నర్‌కు ప్రైజ్‌మనీ' అంటూ టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Pant Prize Money) ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ కనిపించింది. "నీరజ్ చోప్రా స్వర్ణం సాధిస్తే ఒక లక్కీ విన్నర్‌కు రూ.1,00,089 ప్రైజ్ మనీ ఇస్తాను. ఎవరు అయితే లైక్స్ ఎక్కువ కొట్టి కామెంట్లు పెడతారో వారికే ఈ ఛాన్స్. దీంతో పాటే టాప్- 10లో ఉన్న వారికి విమాన టికెట్లను ఇస్తాను. భారత్ నుంచి మాత్రమే కాదు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా మన నీరజ్‌కు మద్దతు ఇవ్వండి" అంటూ ఆ పోస్ట్‌లో రాసి ఉంది.
ఈ పోస్ట్‌తో పాటు పంత్ అకౌంట్లో పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి మరో పోస్టు కూడా వచ్చింది. దీంతో రిషభ్ పంత్ సోషల్ మీడియా అకౌంట్ ఏమైనా హ్యాకింగ్‌కు గురైందా ఏంటి? అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కానీ, ఇప్పటివరకు దీనిపై పంత్ మాత్రం స్పందించలేదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ పోస్టులకు అభిమానుల నుంచి భారీగా స్పందన వస్తోంది.
ఇది ట్రైలర్ మాత్రమే- ఫైనల్లో సినిమా చూపిస్తా: నీరజ్ చోప్రా - Paris Olympics 2024
మను బాకర్‌కు గ్రాండ్ వెల్కమ్ - డప్పు శబ్దాలకు చిందులేస్తూ హంగామా! - Manu Bhaker Grand Welcome