Paris Olympics 2024 Day 2 India: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. స్టార్ షూటర్ మనూ బాకర్ 10మీటర్ల ఎయిర్ పిస్టర్ ఈవెంట్లో కాంస్యం ముద్దాడింది. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం వచ్చి చేరింది. ఇక ఆయా అథ్లెట్లు కూడా రెండో రోజు మెరుగైన ప్రదర్శన చేశారు. పలు క్రీడల్లో క్వాలిఫయర్, రౌండ్ ఈవెంట్లలో సత్తా చాటారు. రెండో రోజు భారత అథ్లెట్లు హైలైట్స్ ఇవే!
🇮🇳 𝗙𝗶𝗿𝗶𝗻𝗴 𝗜𝗻𝗱𝗶𝗮 𝘁𝗼 𝗴𝗹𝗼𝗿𝘆! Really great to see Manu Bhaker with her historic Bronze medal. 😁
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿 𝗲𝘅𝘁𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗰𝗼𝘃𝗲𝗿𝗮𝗴𝗲 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗮𝘁𝗵𝗹𝗲𝘁𝗲𝘀 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗣𝗮𝗿𝗶𝘀 𝗢𝗹𝘆𝗺𝗽𝗶𝗰𝘀 𝟮𝟬𝟮𝟰!
📸 Pics… pic.twitter.com/XuWwCJO5b8
బ్యాడ్మింటన్
స్టార్ షట్లర్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేసింది. తొలిమ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో అలవోక విజయం సాధించి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది. జులై 31న క్రిస్టిన్ కుబ్బాతో పోటీ పడాల్సి ఉంది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేశాడు. అతడు జర్మనీ షట్లర్ ఫాబియన్ రోత్పై 21-18, 21-12 తేడాతో నెగ్గాడు. ఇక 31 జులైన ప్రణయ్ తదుపరి మ్యాచ్ ఆడనున్నాడు.
🇮🇳 𝗔 𝗽𝗲𝗿𝗳𝗲𝗰𝘁 𝘀𝘁𝗮𝗿𝘁 𝗳𝗼𝗿 𝗣𝗩 𝗦𝗶𝗻𝗱𝗵𝘂! PV Sindhu begins her Olympic campaign in the best possible way, as she comfortably defeats Fathimath Abdul Razzaq in her first group stage game. A positive sign for Sindhu, as she looked strong right from the beginning.… pic.twitter.com/vSWUFRKRvD
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024
షూటింగ్
పారిస్ ఒలింపిక్స్‌లో తొలిరోజు నిరాశపరిచిన భారత షూటర్లు రెండోరోజు సత్తా చాటారు. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్‌కు చేరాడు. 630.1 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. మరో యువ షూటర్ రమితా జిందాల్ పతకానికి గురిపెట్టింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 631.5 పాయింట్లతో రమిత ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. ఇదే ఈవెంట్‌లో స్టార్ షూటర్ ఇలవెనిల్ వలరివన్ 630.7పాయింట్లతో పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది.
🇮🇳 𝗧𝗼𝗽 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗳𝗿𝗼𝗺 𝗔𝗿𝗷𝘂𝗻! Arjun Babuta was absolutely brilliant today as he secured his place in the final of the men's 10m Air Rifle event through a top 8 finish in the qualification round.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024
🔫 Arjun Babuta finished at 7 with a score of 630.1 and… pic.twitter.com/V9e8Cw388n
🇮🇳 𝗧𝗲𝗿𝗿𝗶𝗳𝗶𝗰 𝘀𝗵𝗼𝗼𝘁𝗶𝗻𝗴 𝗳𝗿𝗼𝗺 𝗥𝗮𝗺𝗶𝘁𝗮 𝗝𝗶𝗻𝗱𝗮𝗹! After a slow start to the qualification round, Ramita seemed to reserve her best for last as she finished at 05th with a total score of 631.5 to secure a place in the final of the women's 10m Air Rifle… pic.twitter.com/frU2f76wUW
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024
స్విమ్మింగ్
అటు స్విమ్మింగ్ వంద మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ విభాగంలో భారత్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. 55.01 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇక రోయింగ్‌లో రిపెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాల్ రాజ్ పన్వార్ సత్తా చాటాడు. రెండోరౌండ్ లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 7నిమిషాల 12.41 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్
మరోవైపు తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల విభాగంలో జర్మనీ బాక్సర్ మ్యాక్సీ కరీనాను 5-0 తేడాతో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
టేబుల్ టెన్నిస్
టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో తెలుగుతేజం ఆకుల శ్రీజ స్వీడన్ క్రీడాకారిణి క్రిస్టిన్ కల్బర్గ్‌పై గెలుపొంది రౌండ్ 32కు అర్హత సాధించింది. మరోవైపు, ఇదే ఈవెంట్లో మనికా బాత్ర కూడా సంచలనం సృష్టించింది. రౌండ్ 64లో ప్రత్యర్థి అన్నా హర్సీపై నెగ్గి, రౌండ్ 32కు అర్హత సాధించింది.
🇮🇳 𝗦𝗿𝗲𝗲𝗷𝗮 𝗼𝗳𝗳 𝘁𝗼 𝗮 𝘄𝗶𝗻𝗻𝗶𝗻𝗴 𝘀𝘁𝗮𝗿𝘁! Sreeja Akula gets her Olympics campaign off to a winning start as she defeats Christina Kallberg, 4-0, in the round of 64 in the women's singles event.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024
🏓 Sreeja looked very confident today during the match, a positive… pic.twitter.com/85ghIUcrFD
ఇక పురుషుల టెన్నిస్ సింగిల్స్‌లో సుమిత్ నగల్ పోరాడి ఓడాడు. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ అథ్లెట్ కొరింటీన్ మౌటెట్ను ఎదుర్కొన్న సుమిత్ 6-2, 2-6, 7-5 తేడాతో ఓడాడు. మరోవైపు ఆర్చరీ టీమ్ విభాగంలో భకత్, భజన్, దీపికా త్రయం క్వార్టర్ ఫైనల్‌లో నిరాశ పర్చింది. నెదర్లాండ్స్‌తో పోటీపడిన ఈ టీమ్ ఓడింది.
12ఏళ్ల నిరీక్షణకు తెర- తొలి మహిళగా మను రికార్డు- ముర్ము, మోదీ హర్షం - Olympics 2024
సత్తాచాటిన తెలుగమ్మాయి శ్రీజ- షూటింగ్లో ఫైనల్‌కు రమితా జిందాల్ - Paris Olympics 2024