ETV Bharat / sports

గోల్డ్ మిస్​ - జావెలిన్ త్రోలో నీరజ్​ చోప్రాకు రజతం - Paris Olympics 2024 Neeraj Chopra

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 2:09 AM IST

Updated : Aug 9, 2024, 2:15 AM IST

Paris Olympics 2024 Neeraj Chopra Silver : బల్లెం వీరుడు, భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా పారిస్‌ ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు.

source Associated Press
Paris Olympics Neeraj Chopra (source Associated Press)

Paris Olympics 2024 Neeraj Chopra Silver : టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్​ సాధించిన నీరజ్ చోప్రా ఈ సారి రజతంతో సరిపెట్టుకున్నాడు. ​ అతడు ప్రస్తుత ఒలింపిక్స్​ జావెలిన్ త్రో ఫైనల్​లో రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. దీంతో మొత్తం 12 మంది పోటీ పడ్ ఈ ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. పాక్‌ అథ్లెట్‌ నదీమ్‌ అర్షద్‌ 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. గ్రెనడా అథ్లెట్‌ పీటర్స్‌ అండర్సన్‌కు కాంస్యం వచ్చింది.

ఈ తుదిపోరులో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్‌ కేవలం రెండో త్రోలో మాత్రమేసఫలమయ్యాడు. మిగతా అన్ని ప్రయత్నాల్లోనూ ఫౌల్ అయ్యాడు. అయినప్పటికీ వరుసగారెండు ఒలింపిక్స్‌ పోటీల్లో రెండు పతకాలు అందుకున్న వీరుడిగా నీరజ్‌ రికార్డు సృష్టించాడు.

పాక్‌ ప్లేయర్​ అర్షద్‌ రెండు సార్లు 90 మీటర్ల కన్నా ఎక్కువగా ఈటెను విసిరాడు. కాగా, ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌ మొత్తం ఐదు పతకాలు సాధించింది. వీటిలో తొలి సిల్వర్‌ మెడల్‌ నీరజ్‌దే. మిగతా వాటిలో షూటింగ్‌లో మూడు, హకీలో ఒకటి వచ్చింది. ఇవన్నీ కాంస్య పతకాలు.

Last Updated : Aug 9, 2024, 2:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.