Chinese gymnast Zhou Yaqin Paris Olympics Silver Medal : చైనా జిమ్నాస్ట్ జౌ యాకిన్ ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. అది కూడా 18 ఏళ్లకే పతకాన్ని దక్కించుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా పోడియంపై నిల్చొని అమాయకంగా మెడల్‌ను ముద్దాడుతూ కనిపించి అందరినీ ఫిదా చేసింది. అలా ఈ డ్రాగన్ భామ ఫొటోలు చాలా మందిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చి వైరల్‌గా మారింది.
అదేంటంటే? - మెడల్ సాధించిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన జౌ యాకిన్ తిరిగి తన రోజువారీ పనుల్లో బిజీ యిపోయింది. ఇందులో భాగంగానే రెస్టారంట్‌లో భోజనం వడ్డిస్తూ కనిపించింది. అయితే ఇది చూసిన వారు ఆమె ఆ హోటల్లో పని చేస్తుందని చాలా మంది అనుకున్నారు.
అయితే ఆ హోటల్ ఆమె కుటంబానికి చెందినదే. చైనాలోని హునాన్ ప్రావిన్స్ హెన్‌గ్యాంగ్ నగరంలో ఉందా రెస్టారెంట్. తల్లిదండ్రులకు సాయంగా తమ హోటల్‌కు వచ్చే కస్టమర్లకు భోజనం వడ్డించింది. అయితే ఆమె ఒలింపిక్స్ దుస్తుల్లోనే సర్వ్ చేయడంతో ఆ ఫొటోస్ మరింత వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు యాకిన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వైపు కెరీర్, మరోవైపు ఫ్యామిలీకి సాయంగా ఉండటాన్ని అభినందిస్తున్నారు.
అమాయకంగా చూస్తూ? - ఈ డ్రాగన్ అమ్మాయి 18 ఏళ్లకే ఒలింపిక్స్ అరంగేట్రం చేసింది. తన తొలి ఒలింపిక్స్‌లోనే సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్‌లో పతకం సాధించింది. అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్‌ను దాటి ఈ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఈ క్రమంలోనే మెడల్‌ను అందుకున్నాక ఆమె పోడియంపై నిల్చునప్పుడు పక్కనే ఉన్న ఇటలీ జిమ్నాస్ట్‌లు తమ మెడల్స్‌ను నోటితో కొరికారు. దాన్ని చూసిన యాకిన్ వారినే ఫాలో అవుతూ తమ మెడల్‌ను నోటి వద్ద పెట్టుకొని అమాయకంగా ఫొటోలకు పోజులిచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి అందరి దృష్టిలో పడింది.
Chinese gymnast, Zhou Yaqin, who learned the Olympic custom to bite medals after winning a silver one, returned home to work at the restaurant of her parents.
— The NewsWale (@TheNewswale) August 19, 2024
For marketing she serves food now in her Olympic uniform in the “Fat Brother”, Local Cuisine Restaurant in Hengyang… pic.twitter.com/TBWi7yg407
కోహ్లీ, రోహిత్‌ను అలా చేయాలని కోరడం కరెక్ట్ కాదు! : జై షా - Rinku Singh Domestic Cricket