ETV Bharat / sports

పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్​ - ఎవరంటే? - Pakisthan New Captain - PAKISTHAN NEW CAPTAIN

Pakisthan New Captain : పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు అధికారికంగా అనౌన్స్ చేసింది.

పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్​ - ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 1:11 PM IST

Updated : Mar 31, 2024, 1:29 PM IST

Pakisthan New Captain : పాకిస్థాన్ జట్టులో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తిరిగి జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అఫీషియల్​గా ప్రకటించింది. సెలక్షన్‌ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి బాబర్‌ అజామ్​ను తిరిగి సారథిగా నియమించినట్లు తెలిపింది. దీంతో జూన్‌లో మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్‌లో పాక్​ జట్టును ముందుండి నడిపించనున్నాడు. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే ఫార్మాట్​కు తనే నాయకత్వం వహించనున్నాడు.

కాగా, రీసెంట్​గా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ వైఫల్యంతో బాబర్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టెస్టులకు షాన్‌ మసూద్​లను కెప్టెన్లుగా ఎంపిక చేశారు. వన్డే ఫార్మాట్‌కు కెప్టెన్ ఎవరనే విషయం మాత్రం తెలుపలేదు.

అయితే షాన్‌ మసూద్‌ నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది పాక్‌. కానీ కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో ఘోరంగా ఓడిపోయింది. ఇక షాహిన్‌ అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్​ అక్కడ టీ20 సిరీస్‌లో 4-1తో దారుణంగా ఓడింది. ఇకపోతే షాహిన్‌ ఆఫ్రిది పాకిస్థాన్​ సూపర్‌ లీగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో పీసీబీ తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయాలపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి.

ఈ క్రమంలోనే పీసీబీ కొత్త చీఫ్‌గా కొత్తగా పగ్గాలు స్వీకరించిన మొహ్సిన్‌ నఖ్వీ(PCB Chief) కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్​ను దృష్టిలో పెట్టుకుని బాబర్‌ అజామ్​కు(Babar Azam New Captain) తిరిగి బాధ్యతలను అప్పగిచ్చారు. గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవాలని సూచిస్తూ జట్టు కూర్పు, కెప్టెన్సీపై కొత్త నిర్ణయాలను తెలిపారు. సెలక్షన్‌ కమిటీ సిఫారసు మేరకు బాబర్‌ ఆజామ్​ను వన్డే, టీ20ల సారథిగా నియమిస్తున్నట్లు తెలిపారు.

ఐపీఎల్‌లో నయా స్టార్ - బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఎవరీ మయాంక్ యాదవ్? - Who is Mayank Yadav

చెన్నై x దిల్లీ - పంత్ ఆర్మీ వేగం పుంజుకుంటుందా ? - CSK VS DC IPL 2024

Last Updated : Mar 31, 2024, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.