Pakistan Vs Canada T20 World Cup 2024 : వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ ఆఖరికి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది.
పాకిస్థాన్ ప్లేయర్స్ మహ్మద్ ఆమిర్ (2/13), హారిస్ రవూఫ్ (2/26) తమ బౌలింగ్‌తో చెలరేగడం వల్ల కెనడా జట్టు 20 ఓవర్లలో 106/7కే పరిమితమైంది. అరోన్ జాన్సన్ (52); టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాన్సన్ మినహా మిగతా అందరూ తక్కువ స్కోర్‌తోనే సరిపెట్టుకున్నారు.
ఇక కెనడా నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని పాక్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. మహ్మద్ రిజ్వాన్ (53*) తన ఇన్నింగ్స్‌లో అదరగొట్టగా, కెప్టెన్ బాబర్ అజామ్ (33), కూడా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైనప్పటికీ ఈ ఇద్దరి స్కోర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. కెనడా బౌలర్లలో డిల్లాన్ హేలిగర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, జెరెమీ గోర్డాన్ ఒక్క వికెట్ తీశాడు.
నమీబియాపై ఆసీస్ గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టు 17 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. దీంతో 72 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (36) మాత్రమే భారీ స్కోర్ నమోదు చేయగా, మిగతా అందరూ తమ ఇన్నింగ్స్‌లో నిరాశపరించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా, జోష్ హేజిల్‌వుడ్ 2, స్టోనిస్ 2, కమిన్స్, నాథన్ ఎల్లీస్ తలో వికెట్‌ను తమ ఖాతాల్లో వేసుకున్నారు.
ఇక స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5.4 మాత్రమే ఉపయోగించుకుని 74 పరుగులు చేసింది. అది కూడా ఒక్క వికెట్ కోల్పోయి. ఈ జట్టులో డేవిడ్ వార్నర్(20), మిచెల్ మార్ష్(18*), ట్రావిస్ హెడ్(34*) అదరగొట్టారు.
ఆ బౌండరీ ఇచ్చుంటే బంగ్లా విన్ - DRS వివాదంపై ఐసీసీ ఏమంటుందంటే? - T20 World Cup 2024