ETV Bharat / sports

అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి- పాకిస్థాన్ ప్లాన్ బోల్తా కొట్టిందిగా! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Pakistan T20 World Cup 2024: 2024 వరల్డ్​కప్​లో పాకిస్థాన్ ఛాప్టర్ క్లోజ్ అయ్యింది. జూన్ 16న ఐర్లాండ్​తో నామమాత్రపు మ్యాచ్ అడనుంది. అయితే ఈ పొట్టికప్ పోటీ కోసం పీసీబీ వేసిన ప్లాన్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?

Pakistan world Cup 2024
Pakistan world Cup 2024 (Associated press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 3:15 PM IST

Updated : Jun 15, 2024, 3:31 PM IST

Pakistan T20 World Cup 2024: 2024 టీ20 వరల్డ్​కప్​లో పాకిస్థాన్ జర్నీ దాదాపు ముగిసింది. గ్రూప్- A నుంచి టాప్​ 2లో ఉన్న భారత్, అమెరికా సూపర్- 8కు అర్హత సాధించాయి. టోర్నీలో ఇప్పటిదాకా 3 మ్యాచ్​లు ఆడిన పాక్ రెండింట్లో ఓడి, ఒకటి మాత్రమే నెగ్గి మూడో స్థానంలో ఉంది. ఇక గ్రూప్​ స్టేజ్​లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ పాక్​కు అది నామమాత్రమే.

ఈ మ్యాచ్​ ఫలితం ఏదైనా పాకిస్థాన్​కు ఒరిగేదేమీ లేదు. అయితే గత సీజన్ (2022)లో ఫైనలిస్ట్​ అయిన పాక్ ఈసారి గ్రూప్ స్టేజ్​లోనే ఇంటబాట పట్టనుండడం సదరు క్రికెట్ ఫ్యాన్స్​ను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ప్రతిష్ఠాత్మకమైన టీ20 టోర్నీ కోసం పాక్ జట్టు ఎంపిక సరిగ్గా లేదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

పీసీబీ ప్లాన్ రివర్స్!
ప్రస్తుత టోర్నీలో సూపర్- 8 మ్యాచ్​లు వెస్టిండీస్​లో జరగనున్నాయి. అయితే ఈ టోర్నీకి ముందు పాక్ ప్లేయర్లు ఆమిర్ ఖాన్, ఇమాద్ వసీమ్, అజామ్ ఖాన్ వెస్టిండీస్ పిచ్​లపై కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడారు. దీంతో కీలకమైన సూపర్- 8 దశలో ఈ ప్లేయర్ల అనుభవం కలిసి వస్తుందన్న ఉద్దేశంతో సీపీఎల్ (CPL)లో ఆడిన వాళ్లను ఎంపిక చేసినట్లున్నారు. కానీ, ఈ ప్లాన్ బెడిసికొట్టినట్లైంది. సూపర్- 8 మాట అటుంచితే, గ్రూప్ స్టేజ్​లోనే పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా సూపర్- 8కు అర్హత సాధించకుండానే పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. దీంతో వెస్టిండీస్​లో మ్యాచ్​ల కోసం ప్లాన్ చేస్తే, అక్కడకు వెళ్లకుండానే అమెరికా నుంచి తిరిగి స్వదేశం పాకిస్థాన్​కు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

పాక్ జర్నీ: పొట్టికప్ టోర్నీలో పాక్​కు తొలి మ్యాచ్​లోనే ఆతిథ్య అమెరికా షాక్ ఇచ్చింది. డల్లాస్​లో జరిగిన ఈ మ్యాచ్​లో అనూహ్యంగా అమెరికా సూపర్ ఓవర్​లో విక్టరీ కొట్టింది. అప్పుడే పాక్​పై విమర్శలు ప్రారంభమయ్యాయి. పసికూన అమెరికా చేతిలో ఓటమిని పాక్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇక న్యూయార్క్ వేదికగా భారత్​తో మ్యాచ్​లోనూ పాక్ ఓడింది. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 6 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత కెనడాతో మ్యాచ్​లో ఎట్టకేలకు బోణీ కొట్టింది. మరోవైపు అమెరికా మెరుగైన స్థితిలో ఉండడం పాక్ అవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఫ్లోరిడాలో అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా​ రద్దు అవ్వడం వల్ల ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో 5 పాయింట్లతో అమెరికా సూపర్- 8కు క్వాలిఫై అయ్యింది. అటు పాక్ తన చివరి మ్యాచ్​లో నెగ్గినా ఖాతాలో 4 పాయింట్లే ఉంటాయి.

1 పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం- ఉత్కంఠ పోరులో నేపాల్​కు నిరాశ - T20 World Cup 2024

విరాట్ సంగతేంటి!! సూపర్-8కు ముందు మార్పులు తప్పవా? - T20 Worldcup 2024

Last Updated : Jun 15, 2024, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.