ETV Bharat / sports

ట్రోల్స్​పై బాబర్ సీరియస్- వాళ్లందరిపై లీగల్ యాక్షన్​ ​ - T20 World Cup

Babar Azam Legal Actions: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తనను ట్రోల్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Babar Azam Legal Actions
Babar Azam Legal Actions (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 12:16 PM IST

Updated : Jun 22, 2024, 12:45 PM IST

Babar Azam Legal Actions: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తనను ట్రోల్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2024 వరల్డ్​కప్​లో పాక్ వైఫల్యానికి బాబర్ ముఖ్య కారణం అంటూ పలువురు మాజీ క్రికెటర్లు, యూట్యూబర్లు తనను కొన్ని రోజులుగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై బాబార్​తోపాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్​గా ఉంది. ట్రోల్స్​ చేసిన వాళ్లందరి వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలను పాక్ క్రికెట్ బోర్డు సేకరించే పనిలో ఉంది. వాటిని పరిశీలించి చట్టపరంగా వాళ్లకు నోటీసులు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక టీ20 వరల్డ్​కప్ టోర్నీ నుంచి పాక్ సూపర్- 8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. దీంతో ఆటగాళ్లు నసీం షా, ఉస్మాన్ ఖాన్, సీనియర్ మేనేజర్ వహబ్ రియాజ్‌ ఇప్పటికే పాక్ చేరుకున్నారు. కెప్టెన్​ బాబర్ అజామ్​తోపాటు ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్, షాదబ్ ఖాన్, ఆజం ఖాన్‌ శనివారం పాక్​ వెళ్లనున్నారు. ఇక పొట్టికప్​లో విఫలమైనందుకు పాక్ క్రికెట్​లో భారీ మార్పులు ఉంటాయని బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ, జట్టు కోచ్, కెప్టెన్ మార్పులు ఉంటాయని సమాచారం. అయితే బోర్డు అదేశాలను పాటించేందుకు తాను సిద్ధమేనని బాబర్ స్పష్టం చేశాడు.

ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్​ వల్లే జట్టు నిష్క్రమించాల్సి వస్తుందని పాక్​ మాజీ ప్లేయర్ అహ్మద్ షెజాద్ ఆరోపించాడు. 2024 టీ20 వరల్డ్ కప్​లోనూ అదే జరిగిందని అన్నాడు. ఈ టోర్నీలో పాక్ గ్రూప్ దశకే పరిమితమై చాప చుట్టేసింది. గ్రూప్ దశలో పసికూన అమెరికా, టీమ్ఇండియా చేతిలో ఓడింది. తర్వాత ఐర్లాండ్, కెనడాపై గెలిచినా సూపర్- 8లో స్థానం దక్కించుకోలేకపోయింది.

Pakistan Tour Of Australia 2024: ఈ టోర్నీని పరాభవంతో ముగించిన పాకిస్థాన్ సుదీర్ఘంగా కొన్ని నెలల పాటు విరామంలో ఉండనుంది. తిరిగి 2024 నవంబర్​లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్​లో ఆసీస్​తో పాక్ 3వన్డేలు, 3 టీ20 మ్యాచ్​లు ఆడనుంది.

పాక్ క్రికెటర్లకు షాక్- సెంట్రల్ కాంట్రాక్ట్​లు రద్దేనంట! - T20 World Cup 2024

అతడు ప్రతిసారీ అంతే- ఓ తలనొప్పిగా మారాడు!

Last Updated : Jun 22, 2024, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.