Olympics Tarzan Johnny Weissmuller : ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ అనగానే అందరికీ మైఖేల్ ఫెల్ప్స్ లేదా మార్క్ స్పిట్జ్ గుర్తొస్తారు. అయితే వీరికంటే ముందే ఈ విశ్వ క్రీడల్లో ఓ స్విమ్మింగ్ సూపర్ స్టార్ ఉన్నాడు. అతడే జానీ వీజ్‌ముల్లర్ (Johnny Weissmuller). 1924 పారిస్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. అంతే కాదు హాలీవుడ్ మూవీస్‌లో టార్జాన్ పాత్రలో యాక్ట్ చేసి పాపులర్ అయ్యాడు. ఇంతకీ ఆయమ ఒలింపిక్స్ జర్నీ ఎలా మొదలైందంటే?
ఒలింపిక్ విజయాలు
1924 పారిస్ ఒలింపిక్స్‌లో వీజ్‌ముల్లర్ 100 మీటర్ల ఫ్రీస్టైల్, 400 మీటర్ల ఫ్రీస్టైల్, 4x200 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించాడు. వాటర్ పోలోలో కాంస్య పతకాన్ని కూడా గెలిచాడు. ఈ విజయాలతో పావో నుర్మి వంటి లెజెండ్స్‌ని వెనక్కినెట్టి హీరోగా మారాడు. 1912, 1920లో స్వర్ణం గెలిచిన ప్రసిద్ధ హవాయి సర్ఫర్ అయిన డ్యూక్ కహనామోకును వీజ్‌ముల్లర్ ఓడించాడు.
ఈ టార్జన్ ఓ రియల్ లైఫ్ హీరో
స్విమ్మింగ్ ద్వారా పాపులరైన జాన్, 1932లో 'టార్జాన్ ది ఏప్ మ్యాన్'లో టైటిల్ రోల్లో (టార్జన్) నటించాడు. తన సినీ కెరీర్లో అతడు మొత్తం 12 టార్జాన్ సినిమాల్లో నటించాడు. 1927 మిచ్‌గాన్‌లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో సోదరుడు పీటర్‌తో కలిసి 11 మంది ప్రాణాలను కాపాడిన ముల్లర్, రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు.
కొనసాగిన ఒలింపిక్ విజయాలు
వీస్‌ముల్లర్ 1928 ఆమ్‌స్టెర్‌డ్యామ్ ఒలింపిక్స్‌లో విజయాలను కొనసాగించాడు. మరో రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. వాటర్ పోలో టీమ్ కోసం ఆడటానికి 400 మీటర్ల ఫ్రీస్టైల్ నుంచి తొలగించకపోయుంటే ఉంటే మూడో పతకం కూడా ఖాతాలో వేసుకొనే వాడు.
1924 ఒలింపిక్స్‌కు ముందు 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో 57.4 సెకన్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక దశాబ్దం పాటు ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. నిమిషంలో 100 మీటర్లు, ఐదు నిమిషాల్లోపు 400 మీటర్లు ఈత కొట్టిన మొట్ట మొదటి వ్యక్తిగానూ వీస్‌ముల్లర్ చరిత్రకెక్కాడు.
వ్యక్తిగత జీవితం
1904 జూన్ 2న జానీ వీజ్‌ముల్లర్ రొమేనియాలోని ఫ్రీడార్ఫ్‌లో జన్మించాడు. చిన్నవయసులోనే అతడి కుటుంబమంతా యూఎస్‌లో సెటిల్ అయ్యింది. ఆ తర్వాత 1908లో చికాగోలో స్థిరపడింది. చిన్నతనంలో, వీస్‌ముల్లర్ పోలియో బారిన పడ్డాడు. కోలుకోవడంలో భాగంగానే అతడు స్విమ్మింగ్ చేయడం ప్రారంభించాడు.
మొదట కోచ్ బిల్ బచ్రాచ్ వీజ్‌ముల్లర్ ప్రతిభను గుర్తించాడు. చాలా త్వరగానే స్విమ్మింగ్‌లో రాటుదేలాడు. 20వ శతాబ్దపు ప్రారంభంలోఈయన తన ట్యాలెంట్‌తో అమెరికన్ కల్చరల్ సింబల్‌గా మారాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో 'మేడ్ ఇన్ ఇండియా'- అది తల్లీ, కుమార్తె ఘనతే! - Paris 2024 Olympics
పారిస్ అతిథులకు స్పెషల్ ట్రీట్మెంట్ - 'ఇండియా హౌస్'లో ఏమున్నాయంటే? - Paris Olympic 2024