ETV Bharat / sports

ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు దూకుడు- ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ సాధించిందంటే? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Olympics Medals In Hockey  : పారిస్ ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. ఆదివారం క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌-2 బ్రిటన్‌ ను ఓడించి సెమీస్​కు చేరింది. అయితే ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ విశ్వ క్రీడల్లో భారత హాకీ జట్టు ఎన్ని పతకాలు గెలిచిందంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 7:25 PM IST

Olympics Medals In Hockey : ఒలింపిక్స్​లో హాకీ ఇప్పటివరకు 12 పతకాలు గెలుచుకుంది. అందులో 8 స్వర్ణాలు, 3 కాంస్యాలు, ఒక రజత పతకం ఉంది. ఈ పారిస్ ఒలింపిక్స్​లో కూడా అదరగొట్టి మరో పతాకాన్ని ఖాతాలో వేసుకోవాలని భారత్ హాకీ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటివరకు భారత్ ఏయే ఒలింపిక్స్ లో పతకాలు సాధించిందో తెలుసుకుందాం.

1928 ఆమ్‌ స్టర్‌ డామ్ ఒలింపిక్స్ (గోల్డ్)- ఈ ఒలింపిక్స్​లో ఫైనల్స్​లో నెదర్లాండ్స్‌ ను 3-0తో ఓడించి భారత్ తొలి పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌ లో భారత్‌ కు ఇదే తొలి, బంగారు పతకం కావడం విశేషం.

1932 లాస్ ఏంజిల్స్ (గోల్డ్) - ఈ ఒలింపిక్స్​లోనే భారత్ మరో సారి పసిడి పతకాన్ని ముద్దాడింది. అమెరికాను 24-1తో ఓడించింది. ఇది ఒలింపిక్స్ హాకీ చరిత్రలో అతి పెద్ద విజయం.

1936 బెర్లిన్ ఒలింపిక్స్ (గోల్డ్)- దిగ్గజ ప్లేయర్ ధ్యాన్ చంద్ నేతృత్వంలో భారత జట్టు 1936లో బెర్లిన్‌ ఒలింపిక్స్ లో జర్మనీని 8-1 తేడాతో ఓడించింది. దీంతో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ ను సాధించింది.

1948 లండన్ ఒలింపిక్స్( గోల్డ్) - రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940,1944లో ఒలింపిక్స్ క్రీడలు జరగలేదు. 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించింది. స్వాతంత్యం అనంతరం భారత హాకీ జట్టు సాధించిన తొలి పతకం ఇదే.

1952 హెల్సింకి ఒలింపిక్స్ (గోల్డ్) - నెదర్లాండ్స్ ను ఓడించి భారత్ బంగారు పతకాన్ని సాధించింది. వరుసగా భారత్ కు ఐదో గోల్డ్ మెడల్.

1956 మెల్ బోర్న్ ఒలింపిక్స్ (గోల్డ్)- పాకిస్థాన్ ను ఓడించి భారత్ మరో స్వర్ణాన్ని సాధించింది. వరుసగా భారత హాకీ జట్టుకు ఆరో గోల్ట్ మెడల్.

1960 రోమ్ ఒలింపిక్స్ (సిల్వర్) - రోమ్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు ఫైనల్ లో పాకిస్థాన్ పై ఓడి రజత పతకాన్ని సాధించింది.

1964 టోక్యో ఒలింపిక్స్ (గోల్డ్) - టోక్యో ఒలింపిక్స్ లో పాకిస్థాన్ ను ఓడించి మరో స్వర్ణాన్ని భారత్ ముద్దాడింది.

1968 మెక్సికో ఒలింపిక్స్ (కాంస్యం) - ఈ ఒలింపిక్స్ లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది.

1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ (కాంస్యం) - సెమీ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిపోయిన భారత్ కాంస్యం సాధించింది.

1980 మాస్కో ఒలింపిక్స్(గోల్డ్) - ఫైనల్ లో స్పెయిన్ ను ఓడించిన భారత్ మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.

2021 టోక్యో ఒలింపిక్స్ (కాంస్యం) - 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్యం దక్కింది. 5-4 తేడాతో జర్మనీని ఓడించి పతకం సాధించింది.

మంచు గడ్డలపై వాకింగ్, ఎండుగడ్డిపై నిద్ర - భారత హాకీ ప్లేయర్లకు హార్డ్ ట్రైనింగ్! - Paris Olympics 2024

హాకీలో సంచలనం - సెమీస్​కు చేరిన భారత జట్టు - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.