Olympics Effect On Paris Tourism: ఒలింపిక్స్ నిర్వహణకు ఆతిథ్య దేశాలు భారీగా ఖర్చు చేయాలి. స్టేడియాలను నిర్మించడానికి, సౌకర్యాలు, మెరుగైన భద్రత కల్పించడానికి పెద్ద మొత్తంలో వెచ్చించాలి. అయితే ఆతిథ్య దేశాలకు ఈ ఆర్థిక భారాలు ఎలా ఉన్నా, టూరిజం ఆకర్షణీయంగా మారుతుందన్న సంతృప్తి దక్కేది. రెండు వారాల పాటు జరిగే అతిపెద్ద క్రీడా మహోత్సవం చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి ప్రజలు తరలి వచ్చేవారు.
అయితే ఇప్పుడు ఫ్రాన్స్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మామూలుగా కంటే పర్యాటకుల రద్దీ తక్కువైంది. టూరిస్ట్‌లు రూటు మారుస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ఐరోపాలోని టాప్ డెస్టినేషన్స్‌లో ఫ్రాన్స్ ఒకటి. ఇక్కడి ఈఫిల్ టవర్, ఇతర చారిత్రక ప్రాంతాలు చూసేందుకు ఏటా మిలియన్ల మంది సందర్శకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్నా, ఫ్రాన్స్ పర్యాటకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. పర్యాటకుల సంఖ్య పెరగకపోవడం అటుంచితే గతేడాది కంటే తగ్గుతోంది.
తగ్గిన పర్యాటకులు
ఒక నివేదిక ప్రకారం, ఫ్రాన్స్‌కు పారిస్ 2024 ఒలింపిక్స్ ఆర్థిక గందరగోళంగా మారుతోంది. ఎందుకంటే దేశం పర్యాటక ప్రయోజనాల్లో ఆశించిన మార్పులు కనిపించడం లేదు. హోటల్ బుకింగ్‌లు, విమానాలు, ట్రావెల్ అడ్వైజర్లకు పెద్దగా డిమాండ్ పెరగలేదు. ప్రస్తుత త్రైమాసికంలో ఎయిర్ ఫ్రాన్స్ €180 మిలియన్ల నష్టాన్ని నమోదు చేసిందని నివేదిక పేర్కొంది. ఆ రెండు వారాల వ్యవధిలో దేశం సాధారణం కంటే ఎక్కువ రద్దీగా ఉంటుందని పర్యాటకులు భావిస్తుండం వల్ల, అంతర్జాతీయ ప్రయాణికులు ఒలింపిక్స్ కారణంగా ఫ్రాన్స్‌కు రావడం మానుకుంటున్నారు.
అధిక ఖర్చులు, తక్కువ రాబడి
ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఒలింపిక్స్‌ను పారిస్‌కు తీసుకురావడానికి భారీగా పెట్టుబడి పెట్టారు. ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి €7.5 బిలియన్ (£6.3 బిలియన్) ఖర్చు చేశారు. దురదృష్టవశాత్తు, ఆశించిన టూరిజం బూమ్ కార్యరూపం దాల్చలేదు. హోటల్ బుకింగ్‌లు నిరుత్సాహకరంగా ఉన్నాయి. పారిస్ పర్యాటక చరిత్రలో వరస్ట్ సమ్మర్ సీజన్‌గా నిలవనుంది. అయితే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు బుకింగ్స్‌లో స్వల్ప పెరుగుదల ఉంది. కానీ మొత్తం ఆక్యుపెన్సీ 2023 జులైలో చూసిన స్థాయి కంటే తక్కువగా ఉంది. ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ హోటల్ ధరలు కూడా తగ్గుతుండటం గమనార్హం.
ఖర్చులు నియంత్రణలో?
పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ సీఈవో ఎటియెన్ థోబోయిస్ గతంలో విలేకరులతో మాట్లాడారు. 'ప్రతి ఒక్కరూ ఖర్చు చేసిన ప్రతి యూరో గురించి స్పృహ కలిగి ఉన్నారు. ప్రతి ఖర్చు ఉపయోగకరంగా ఉంటుంది. మేము ఇప్పటికే అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఎటువంటి ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి. స్పష్టంగా చెప్పాలంటే, అది ఒక సవాలు' అని చెప్పారు. ఖర్చుల సంగతి పక్కన పెడితే, ఫ్రాన్స్ ఉన్న ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఒలింపిక్స్ నిర్వహణతో ఫ్రాన్స్‌కి ఆర్థిక నష్టాలు తప్పవు.
పారిస్ ఒలింపిక్స్‌కు 70వేల కోట్ల ఖర్చు- హిస్టరీలో రిచ్చెస్ట్ సీజన్ ఇదే! - PARIS OLYMPICS 2024