Nikhat Zareen Seeks Personal Coach : భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన బాక్సర్ నిఖత్ జరీన్, ప్రీ క్వార్టర్స్‌లో ఓడిపోయింది. పతకం లేకుండా దేశానికి తిరిగొచ్చింది. అయితే ఈసారి బలంగా పుంజుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంది. అయితే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ ఇప్పుడు తన బాక్సింగ్ కెరీర్‌లో మరింత మెరుగుపడటం, కొత్త శిఖరాలను చేరుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందు కోసం వ్యక్తిగత కోచ్‌ను ఎంపిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఒలింపిక్స్‌లో ఓటమి - ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన నిఖత్, తొలి రౌండ్లో చైనాకు చెందిన టాప్-సీడ్ వు యుపై ఓడిపోయింది. ప్రారంభంలోనే నిఖత్ గట్టి సవాలును ఎదుర్కొంది. ఈ ఓటమిపై నిఖత్ మాట్లాడుతూ, ‘"ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అది నా రోజు కాదు. నిజంగా బాధ కలిగించే విషయం ఏమిటంటే, నేను ఇప్పటికే ఓడించిన బాక్సర్లు పతకాలు సాధించారు. అది హృదయ విదారకంగా ఉంది. కానీ మనం వాస్తవాన్ని అంగీకరించి ముందుకు సాగాలి." అని పేర్కొంది.
వ్యక్తిగత కోచ్‌ను వెతుకుతున్న నిఖత్ - వ్యక్తిగత కోచ్ ఉండటం వల్ల తన పెర్ఫార్మెన్స్‌లో గణనీయమైన మార్పు రావచ్చని నిఖత్ అభిప్రాయపడింది. ఇటీవల శిక్షణ సమయంలో తనకు ఎవరూ లేరని, ఇప్పుడు తనకు గైడెన్స్ అందించే కోచ్ కోసం వెతుకుతున్నానని పేర్కొంది. కోచ్‌ను ఎంచుకున్న తర్వాత అందరికీ తెలియజేస్తానని తెలిపింది. ఇతర దేశాలకు చెందిన బాక్సర్‌లతో శిక్షణ పొందడం వల్ల నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాగలనని, వృద్ధి సాధించడానికి అది కీలకమని చెప్పింది.
బలం పెంచుకోవడంపై దృష్టి - ఆమె మెరుగుపడాలనుకుంటున్న అంశాలపై నిఖత్ మాట్లాడుతూ, ‘"నేను నా బలాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను." అని చెప్పింది. ఆమె తదుపరి శిక్షణలో దీనిపై ఎక్కువ దృష్టి పెట్టనుంది.
బాక్సింగ్ భవిష్యత్తుపై ఏమందంటే? - ఒలింపిక్స్‌లో బాక్సింగ్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) పాలన, ఆర్థిక దుర్వినియోగం సమస్యల కారణంగా సస్పెండ్ అయింది. దీంతో భారతదేశం IBA నుంచి విడిపోయింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మద్దతు ఉన్న వరల్డ్ బాక్సింగ్‌లో చేరింది.
సమీప భవిష్యత్తులో వరల్డ్ బాక్సింగ్‌లో ఎలాంటి వెయిట్ కేటగిరీలను ప్రవేశపెడతారో వేచి చూడాలని నిఖత్ జరీన్ పేర్కొంది. వారు బరువు కేటగిరీలను మార్చవచ్చని, 52 కిలోల కేటగిరీ ఉంటే, చాలా సంతోషంగా ఉంటానని, నాకు అదే అత్యంత సౌకర్యవంతమైన వెయిట్ అని పేర్కొంది.
'కోహ్లీ బ్యాట్ వల్ల నా ఇమేజ్ దెబ్బతింది - ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను'
WTC టేబుల్లో కిందకి పడిపోయిన పాక్ - మరి భారత్ స్థానం ఎంతంటే?