Babar Azam Arshad Nadeem: పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించాడు. ఫైనల్‌లో ఏకంగా 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి ముద్దాడి ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ 40ఏళ్ల స్వర్ణ పతకం నిరీక్షణకు తెరదించాడు. ఒలింపిక్స్‌లో పాక్ చివరిసారి 1984లో పసిడి పతకం సాధించింది. ఈ విజయంతో పాక్‌లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. అయితే ఓవైపు నెటిజన్లు అర్షద్‌ను మెచ్చుకుంటూనే మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అర్షద్ విసిరిన ఈట దూరంతో బాబర్ ఆజమ్ స్ట్రైక్ రేట్‌ను పోలుస్తూ హేళన చేస్తున్నారు. ఆర్షద్ 92.97మీటర్ల కంటే బాబర్ వన్డే ఫార్మాట్ స్ట్రైక్ రేట్ (88.75) తక్కువ అంటూ మీమ్స్ చేస్తున్నారు. మరికొందరు అర్షద్ ఈట డిస్టెన్స్ 92.97మీ, బాబర్ 2022 టీ20 వరల్డ్‌కప్ స్ట్రైక్ రేట్ (93.20) దాదాపు సమానమే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
Arshad Nadeem Javelin throw distance- 92.97
— Ajay Nishad (@ajay998nishad) August 9, 2024
Babar Azam strike rate in T20 WC 2022- 93.23
Babar Azam- 1, Arshad Nadeem-0🤧 pic.twitter.com/gKKsAxxaDh
Arshad Nadeem throw was better than Babar Azam's strike rate....#JavelinThrow pic.twitter.com/gdkMRfzUkF
— Anuj Gujjar🇮🇳 (@AnujS28_) August 8, 2024
Arshad Nadeem throw 92.7m
— Jedi, you look lonely. (@HassanRonaNhi) August 8, 2024
Babar azam Strike rate of WC t20 86.2 pic.twitter.com/TubGcIUTKu
కాగా, పారిస్ ఒలింపిక్స్ ఇదే ఈవెంట్లో భారత స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. అతడు రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. దీంతో మొత్తం 12 మంది పోటీ పడ్ ఈ ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్‌కు కాంస్యం వచ్చింది.
ఈ తుదిపోరులో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్ కేవలం రెండో త్రోలో మాత్రమే సఫలమయ్యాడు. మిగతా అన్ని ప్రయత్నాల్లోనూ ఫౌల్ అయ్యాడు. అయినప్పటికీ వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో రెండు పతకాలు అందుకున్న వీరుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. అందులో ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలున్నాయి. వీటిలో తొలి సిల్వర్ మెడల్ నీరజ్‌దే. మిగతా వాటిలో షూటింగ్‌లో మూడు, హకీలో ఒకటి వచ్చింది. ఇవన్నీ కాంస్య పతకాలు.