ETV Bharat / sports

కష్టపడ్డ సౌతాఫ్రికా - లో స్కోరింగ్ మ్యాచ్​లో నెదర్గాండ్స్​పై గెలుపు - T20 World Cup - T20 WORLD CUP

SA vs NED T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో నెదర్లాండ్స్​తో సౌతాఫ్రికా తలపడింది. నసావు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్​లో నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.

SA vs NED T20
SA vs NED T20 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 10:57 PM IST

Updated : Jun 9, 2024, 6:33 AM IST

SA vs NED T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో భాగంగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో సౌతాఫ్రికా విజయం సాధించింది. గ్రూపు డీ లో భాగంగా జరిగిన ఈ పోరులో నాలుగు వికెట్ల తేడాతో కివీస్ సేన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ జట్టు 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. సిబ్రాండ్‌ (40) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. అయితే నెదర్గాండ్స్​ తక్కువ లక్ష్యాన్నే ఉంచినప్పటికీ దాన్ని చేధించేందుకు సౌతాఫ్రికాకు చాలా కష్టంగా మారింది. ఒకానొక దశలో 12 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ దశలో మిల్లర్‌ (59*) తన స్కోరుతో జట్టును ఆదుకున్నాడు. స్టబ్స్‌ (33)తో అయిదో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. స్టబ్స్‌ తర్వాత యాన్సెన్‌ (3) కూడా ఔటైనప్పటికీ కేశవ్‌ మహరాజ్‌తో కలిసి మిల్లర్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 9వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు విజృంభించడం వల్ల 5గురు బ్యాటర్లు సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. అందులో ముగ్గురు పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మిడిలార్డర్​లో క్రీజులోకి వచ్చిన సిబ్రాండ్ 40 పరుగులు నమోదు చేసి టాప్ స్కోరర్​గా నిలిచాడు. చివర్లో వాన్ బీక్ (23 పరుగులు) రాణించడం వల్ల స్కోర్ 100 పరుగులు దాటింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్టెనిల్ బార్త్​మన్ 4, అన్రీచ్ నోకియా, మార్కో జాన్సన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

నెదర్లాండ్స్ (తుది జట్టు) : స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్​, వికెట్ కీపర్), మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మా.

సౌతాఫ్రికా (తుది జట్టు) : ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్.

Last Updated : Jun 9, 2024, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.