ETV Bharat / sports

నీరజ్‌ నెట్​వర్త్​: ఖరీదైన కార్లు, బైకులు- లగ్జరీ హౌస్​- బల్లెం వీరుడి ఆస్తి ఎంతంటే? - Neeraj Chopra Net Worth - NEERAJ CHOPRA NET WORTH

Neeraj Chopra Net Worth: నీరజ్‌ చోప్రా వరుసగా ఒలింపిక్స్ లో రెండు పతకాలు కొట్టి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈటెగాడు. భారత్‌కు ఈ ఒలింపిక్స్​లో తొలి రజత పతాకాన్ని అందించి తన పేరును చరిత్ర పుస్తకాల్లో స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంత పేరున్న నీరజ్‌ లైఫ్‌ స్టైల్ ఎలా ఉంటుంది, అతని ఆస్తులు ఎంతో మీకు తెలుసా?

Neeraj Chopra Net Worth
Neeraj Chopra Net Worth (Associated Press (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Aug 9, 2024, 3:41 PM IST

Updated : Aug 9, 2024, 5:15 PM IST

Neeraj Chopra Net Worth: దేశవ్యాప్తంగా నీరజ్‌ చోప్రా పేరు మార్మోగిపోతోంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన ఈ గోల్డెన్‌ బాయ్‌ చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం అందించి నీరజ్ చరిత్ర పుటల్లో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే ఈ గోల్డెన్‌ బాయ్‌ ఆస్తులు ఎంతుంటాయ్‌? ఏడాదికి ఎన్ని కోట్లు సంపాదిస్తడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. .

అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా దేశంలో అత్యధికంగా సంపాదించే రెండో అథ్లెట్ నీరజ్‌ చోప్రానే కావడం విశేషం. నీరజ్‌ గ్యారేజ్‌ నిండా లగ్జరీ కార్లు, ఖరీదైన బైక్‌లు ఉంటాయి. విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.

ఆస్తులు రూ. 37 కోట్లపైనే
నీరజ్‌ లైఫ్‌ స్టైల్ విలాసవంతంగా ఉంటుంది. ఈ స్టార్‌ అథ్లెట్‌ ఆస్తుల విలువ 2024 నాటికి రూ. 37 కోట్లకుపైనే అని ఒక అంచనా. ఆయా టోర్నమెంట్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా నీరజ్‌ ఏడాదికి భారీగానే ఆర్జిస్తున్నాడు. నీరజ్ చోప్రా హరియాణా ప్రభుత్వంలో గ్రూప్‌- 1 ఉద్యోగి కూడా. జీతం, టోర్నమెంట్‌ మ్యాచ్ ఫీజు కలిపితేనే నీరజ్‌కు ఏటా దాదాపు రూ.4 కోట్లపైనే ఆదాయం వస్తుంది. ఈ మొత్తం అతని నికర ఆస్తుల్లో కేవలం 10 శాతం మాత్రమే. నీరజ్ కు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏడాది పొడవునా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.

టాప్‌ బ్రాండ్‌లు
స్టార్‌ బ్రాండ్‌లకు ఎండార్స్‌మెంట్‌లు చేస్తూ నీరజ్‌ భారీగా ఆర్జిస్తున్నాడు. నైకీ (NIKE), గాటోరేడ్ (Gatorade), టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్, క్రెడ్‌ (Cred), ఒమేగా, ప్రాక్టర్ & గాంబుల్, మొబిల్ ఇండియా, లిమ్కా, మజిల్‌బ్లేజ్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లకు కూడా నీరజ్ చోప్రానే యాడ్‌లు చేస్తున్నాడు.

లగ్జరీ కార్లు, బైకులు
నీరజ్‌ గ్యారేజీలు కార్లు చూస్తే మతిపోతుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్, ఫోర్డ్ మస్టాంగ్ GT, టొయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా థార్, మహీంద్రా XUV700 లాంటి ఖరీదైన వాహనాలు నీరజ్ దగ్గర ఉన్నాయి. నీరజ్‌కు మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్ర గతంలో థార్‌ SUVని బహుమతిగా ఇచ్చాడు. ఖరీదైన బైకులు కూడా నీరజ్‌ గ్యారేజ్‌లో ఉన్నాయి. హార్లీ-డేవిడ్‌సన్ 1200 రోడ్‌స్టర్, బజాజ్ పల్సర్ 220ఎఫ్‌ సహా ఎన్నో బైక్స్‌ కూడా నీరజ్‌ గ్యారేజ్‌లో ఉన్నాయి.

గోల్డ్​ విన్నర్​ నదీమ్​కు రూ.42 లక్షలు ప్రైజ్​ మనీ, నీరజ్​కు ఎంతో తెలుసా?

'అలా జరిగినందుకు చాలా బాధగా ఉంది' : సిల్వర్​ మెడల్​ దక్కడంపై నీరజ్ చోప్రా - Neeraj Chopra Silver Medal

Last Updated : Aug 9, 2024, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.