Neeraj Chopra Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ మిస్ అవ్వడంపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి విచారం వ్యక్తపరిచాడు. తాజాగా ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు తెలిపాడు. 'అందరికీ సారీ. ఒలింపిక్ పోడియంపై టోక్యో మాదిరి పారిస్‌లో మన జాతీయ గీతం ఈసారి ప్లే అవ్వలేదు. పారిస్‌లో నేను ఆశించిన పతకం సాధించలేకపోయా ' అని నీరజ్ తాజాగా వ్యాఖ్యానించాడు.
అయితే ఒలింపిక్స్‌లో ఏ ఈవెంట్లో అయినా గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ల జాతీయ గీయం ప్లే అవుతుంది. రజతం, కాంస్యం నెగ్గిన అథ్లెట్లకు ఫ్లాగ్ రైజింగ్ మాత్రమే ఉంటుంది. వాళ్ల జాతీయ గీతం పోడియంపై ప్లే చేయరు. ఇక నీరజ్‌కు నెటిజన్లు సోషల్ మీడియాలో మద్దతుగా నిలుస్తున్నారు. నీరజ్ క్షమాపణలు చెప్పే అవసరం లేదని పేర్కొన్నారు. 'నీరజ్ నువ్వు మా ఛాంపియన్', 'ఈసారి పోయినా నెక్ట్స్ పక్కా గోల్డ్ సాధిస్తావ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గత ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలో దిగిన నీరజ్ స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. దీంతో ఈసారి జావెలిన్‌లో నీరజ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పక్కా పసిడి సాధిస్తాడన్న దీమా ఉండింది. కానీ, గురువారం జరిగిన ఫైనల్లో అనూహ్యంగా పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, నీరజ్ సాధించిన వెండి పతకమూ భారత్‌కు బంగారమే!
Neeraj Chopra said, " i would like to apologise to everyone, our national anthem was not played on the podium like last time in tokyo. i did not win the medal for which i had come here for in the paris olympics". pic.twitter.com/h9OZWnFeJj
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 10, 2024
ఆటను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని నీరజ్ ఇదివరకే అభిప్రాయపడ్డాడు. 'దేశానికి మెడల్ అందించినందుకు ఆనందంగానే ఉంది. కానీ నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. కచ్చితంగా దీనిపై సమీక్షించుకుంటాను. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. జావెలిన్ త్రో గట్టి పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ కూడా తనదైన రోజున అదరగొడతాడు. ప్రస్తుతం ఇది అర్షద్ డే. అయినా నేను కూడా వంద శాతం కష్టపడ్డాను. కానీ మరికొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉంది' అని ఫైనల్ తర్వాత అన్నాడు.
బంగారుకొండకు వెండి దండ - నీరజ్ చోప్రా సెన్సేషనల్ రికార్డ్ - PARIS OLYMPICS 2024
గోల్డ్ మిస్ - జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు రజతం - Paris Olympics 2024 Neeraj Chopra