Neeraj Chopra Coach : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా - కోచ్ క్లాస్ బార్టోనిట్జ్ 5ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగియనుంది. జర్మనీకి చెందిన 75ఏళ్ల బార్టోనిట్జ్ తన కోచింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకన్నాడు. అతడు నీరజ్‌కు గత ఐదేళ్లుగా జావెలిన్ త్రోలో శిక్షణ ఇచ్చాడు. అయితే వయసు రీత్యా బార్టోనిట్జ్ ఇకపై కోచింగ్ ఇవ్వడం ఆపేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత అథ్లెట్స్ ఫెడరేషన్ తాజాగా పేర్కొంది.
'బార్టోనిట్జ్ వయసు 75 ఏళ్లు. ఈ వయసులో ఎక్కువగా అతడు జర్నీ చేయాలనుకోవడం లేదు. బార్టోనిట్జ్ ఇకపై తన ఫ్యామిలీకి సమయం కేటాయించాలనుకుంటున్నాడు' అని అథ్లెట్స్ ఫెడరేషన్ అధికారి ఒకరు చెప్పారు.
నీరజ్ చోప్రాకు 2019 నుంచి బార్టోనిట్జ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే తొలుత బయోమెకానిక్స్ నిపుణుడుగా వచ్చిన బార్టోనిట్జ్, ఆ తర్వాత కోచ్‌గా నియామకమయ్యాడు. బార్టోనిట్జ్ ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా తన కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్‌లో రజతాన్ని సాధించాడు. అలాగే ప్రపంచ, డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆసియా క్రీడల్లోనూ నీరజ్ గోల్డ్ దక్కించుకున్నాడు. బార్టోనిట్జ్ కోచింగ్‌లో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు.
పారిస్‌లో సిల్వర్
టోక్యో ఒలింపిక్స్ (2020)లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్(2024)లో రజతం గెలుచుకుని వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకం అందుకున్న మొదటి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు నీరజ్ చోప్రా. అయితే పారిస్ ఒలింపిక్స్ సమయంలో గజ్జల్లో గాయం అయినప్పటికీ పట్టు విడవకుండా పోటీపడ్డాడు. ఇటీవల బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ లోనూ ఎడమచేతి వేలికి గాయం కారణంగా ఇబ్బందిపడిన నీరజ్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. కాగా డైమండ్ లీగ్ ఫైనల్‌లో అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరిన నీరజ్ కేవలం ఒక్క సెంటీమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
నా లక్ష్యం అదే!
ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన నీరజ్ ఈ విషయం గురించి హరియాణాలో నిర్వహించిన 'మిషన్ ఒలింపిక్స్ 2036' సదస్సులో మాట్లాడాడు. 2025లో జరగనున్న టోక్యో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పూర్తిగా ఫిట్ నెస్ సాధించి పోడియం పూర్తి చేస్తానని, ప్రస్తుతం తన ముందున్న పెద్ద లక్ష్యం అదేనని వెల్లడించాడు.
నీరజ్ చోప్రా ఎక్స్ రే పోస్ట్- బల్లెం వీరుడి గాయంపై మను రియాక్షన్ వైరల్ - Neeraj Chopra Manu Bhaker
డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్- ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నదీమ్‌కు షాక్