Rohith Sharma Rahul Dravid : టీ 20 ప్రపంచకప్ 2024 విశ్వ విజేతలుగా నిలిచిన అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై చెప్పేశాడు. బీసీసీఐ కొత్త కోచ్ వేటలో బిజీగా ఉంది. ఇలాంటి దశలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు వదిలి వెళ్తున్న రాహుల్ ద్రావిడ్‌పై ఇన్ స్టాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు.
"ప్రియమైన రాహుల్ భాయ్, నా మనసులోని భావాలను చెప్పేందుకు సరైన పదాల కోసం వెతుకుతున్నాను. కానీ సాధ్యం కాదని నాకు తెలుసు. కాబట్టి, ఇలా ప్రయత్నించాను.
కోట్లాది మంది అభిమానుల్లాగే నేను కూడా నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు దక్కింది.
క్రికెట్‌లో మీరో లజెండ్. కానీ మీరు సాధించిన ఎన్నో విజయాలను ఘనతలను పక్కనపెట్టి, కోచ్‌గా పని చేయడానికి మా దగ్గరికి వచ్చారు. మేమందరం మీతో కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే లెవల్‌కు వచ్చారు. మీతో ఏదైనా చెప్పగలిగేంత అవకాశాన్ని ఇచ్చారు.
ఇది మీరు మాకిచ్చిన గొప్ప బహుమతి. ఆట పట్ల మీకున్న ప్రేమ, మీ వినయం మీ హుందాతనానికి కారణం. మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి కణాన్ని జ్ఞాపకంగా మార్చుకున్నాను. నా భార్య మీరు నా వర్క్ వైఫ్ అని చెబుతుంటుంది. అలా పిలవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను.
మీ విజయాల్లో ఇదొక్కటే లేదు(వరల్డ్ కప్). మనం కలిసి సాధించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాహుల్ భాయ్, మిమ్మల్ని నా కాన్ఫిడెంట్, నా కోచ్, నా స్నేహితుడు అని పిలవడం గొప్పగా భావిస్తున్నాను. సెల్యూట్" అని రాసుకొచ్చాడు.
- అప్పుడే రిటైర్ అవుదామనుకున్న ద్రవిడ్?
2023 నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత, నిరాశకు గురైన ద్రవిడ్ కోచ్ పదవికి రాజీనామా చేయాలని ఆలోచించాడు. అయితే, జట్టు కెప్టెన్ రోహిత్‌తో మాట్లాడిన తర్వాత పునరాలోచనలో పడ్డాడు. రోహిత్ కోరడంతో టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగాడు. ఫైనల్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ద్రవిడ్ తన వీడ్కోలు ప్రసంగంలో ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. నన్ను ఇంకొంత కాలం కోచ్‌గా ఉండమని చెప్పినందుకు థ్యాంక్స్ రోహిత్ అని చెప్పాడు.
ద్రవిడ్‌కు ఆ ఐపీఎల్ టీమ్ బ్లాంక్ చెక్ ఆఫర్! - ఏ రోల్ కోసమంటే? - IPL 2025 Rahul Dravid
బుమ్రా, స్మృతి మందాన సరికొత్త చరిత్ర - ICC Players of Month june 2024