ETV Bharat / sports

ఒకే రోజు అటు అన్న - ఇటు తమ్ముడు - సెంచరీలతో దంచేశారు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 9:10 PM IST

Musheer Khan sarfaraz Century : ఒకే రోజు అటు అన్న సర్ఫరాజ్​ ఖాన్ - ఇటు తమ్ముడు ముషీర్ ఖాన్​ - సెంచరీలతో దంచేశారు. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat

Musheer Khan Century : ఐసీసీ అండర్‌-19 ప్రపంచ కప్​ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్‌ ఖాన్‌ అదిరే ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడి సెంచరీతో అదరగొట్టాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ ఉదయ్‌ సహరన్‌ (75; 84 బంతుల్లో 5 ఫోర్లు) కూడా మంచిగా రాణించాడు. ముషీర్‌, ఉదయ్‌ జోడీ కలిసి మూడో వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ (17), అర్షిన్ కులకర్ణి (32) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా - చివర్లో అరవెల్లి అవనీశ్ (22; 13 బంతుల్లో 3 ఫోర్లు), సచిన్‌ దాస్‌ (21*; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. దీంతో యువ టీమ్​ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్​ 29.4ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటై కుప్పకూలింది. దీంతో భారత్​ 201 భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.

అన్న కూడా ఇరగదీశాడు : ముంబయి బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ - ముషీర్‌ ఖాన్​కు అన్నయ్య. ఇతడు కూడా శతకంతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్​ లయన్స్‌తో భారత్‌-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో సర్ఫరాజ్‌ దుమ్ములేపాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇద్దరు ఒకే రోజు శతకాలతో చేలరేగారు. దీంతో ఈ అన్నాదముళ్లను క్రికెట్‌ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. "అన్న ఇంగ్లాండ్​ లయన్స్‌ మీద 161, తమ్ముడేమో ఐర్లాండ్‌ మీద 118 ఈరోజు సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ ఖాన్‌లదే" అంటూ అన్నాదముళ్లపై పొగడ్తలు కురిపిస్తున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమ్​ఇండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు.

కింగ్ కోహ్లి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు

ఉప్పల్‌ టెస్ట్ : స్పిన్నర్ల మ్యాజిక్​ - దంచికొట్టిన జైశ్వాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.