MS Dhoni Thala for a Reason : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మహీ గుడ్ బై చెప్పేసినా, అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌లో చాలా కాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహీని అభిమానులు ముద్దుగా ‘తల’ అని పిలుచుకుంటారని తెలిసిందే. అయితే ఆ మధ్య ‘తలా ఫర్ ఏ రీజన్’ ట్రెండ్ సోషల్ మీడియాని ఊపేసింది. ఈ ట్రెండ్ గురించి తాజాగా మహీ ఓ ఈవెంట్‌లో స్పందించాడు. తనకూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ‘తలా ఫర్ ఏ రీజన్’ గురించి తెలిసిందని చెప్పాడు.
- తలా ఫర్ ఏ రీజన్ అన్న ధోనీ
ఈవెంట్‌లో హోస్ట్ ధోనీని తల ఫర్ ఎ రీజన్ ట్రెండ్ గురించి అడిగాడు. దీనికి మహీ బదులిస్తూ, ‘దాని గురించి నాకే తెలియదు (తలా ఫర్ ఏ రీజన్ ట్రెండ్ గురించి). నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే తెలుసుకున్నాను. సోషల్ మీడియా లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైనా అవసరం ఉంటే నా ఫ్యాన్సే నన్ను డిఫెండ్ చేస్తారు, నా గురించి గొప్పగా మాట్లాడుతారు. నేను సోషల్ మీడియాలో ఏం చేయాల్సిన అవసరం లేదు. వారే అంత చూసుకుంటారు. నా అభిమానులకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేనప్పటికీ, వాళ్లు నన్ను ప్రేమిస్తారు. నేను ఏదైనా పోస్ట్ చేస్తే లైక్ చేస్తారు. నా నుంచి పోస్ట్ కోసం వాళ్లు వెయిట్ చేస్తుంటారు, నేను చేయగానే దాన్ని లైక్ చేస్తారు. వారికి కృతజ్ఞతలు.’ అని చెప్పాడు. అనంతరం హోస్ట్ కోరిక మేరకు, ధోని తల ఫర్ ఎ రీజన్ అని పలికాడు. - తలా ఫర్ ఎ రీజన్ అంటే ఏంటి?
ధోనీ ఫ్యాన్స్ - క్రికెట్ లేదా క్రికెట్‌కు సంబంధం లేని దానిని హైలైట్ చేసి ధోనీ జెర్సీ నంబర్ 7కు కనెక్ట్ చేసి పోస్ట్‌లు చేస్తుంటారు. ప్రతి పోస్ట్‌కి #Thala for a Reason అనే ట్యాగ్ యాడ్ చేస్తారు. ఫైనల్‌గా ఆ పోస్ట్ నుంచి నెంబర్ 7 వచ్చేలా చేస్తుంటారు. దీనిని మొదటగా రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభించాడు. - 2025 ఐపీఎల్ ఆడుతున్న ధోనీ(Dhoni IPL 2025)
ఈవెంట్‌లో మహీని ఐపీఎల్ ప్లాన్స్ గురించి కూడా ప్రశ్నించారు. దీనికి ధోనీ మాట్లాడుతూ, ‘దీనికి చాలా సమయం ఉంది. ప్లేయర్ రిటెన్షన్ మొదలైన వాటిపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం, బాల్ మన కోర్టులో లేదు. కాబట్టి, నియమాలు, నిబంధనలు ఖరారైన తర్వాత, నేను నిర్ణయం తీసుకుంటాను. ఏం చేసినా ఫ్రాంఛైజీ మేలు కోసమే ఉంటుంది.’ అన్నాడు.
కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. వేలం తర్వాత టోర్నమెంట్‌లో ధోనీ ఆడటం, ఆడకపోవడంపై స్పష్టత రావచ్చు. 2024 ఐపీఎల్‌లో ధోనీ బాగా రాణించాడు. 14 ఇన్నింగ్స్‌లలో 53.67 యావరేజ్‌తో 161 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 220.55 కావడం గమనార్హం.
క్వార్టర్ ఫైనల్‌కు లక్ష్యసేన్ - సాత్విక్, చిరాగ్ జోడీ, నిఖత్‌కు షాక్! - PARIS OLYMPICS 2024