ETV Bharat / sports

విరాట్​ రేర్​ రికార్డ్​ - ఇన్‌స్టాలో ఎక్కువ లైక్స్​ వచ్చిన ఫొటో అదే! - Most Liked Instagram Photo In India

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 5:29 PM IST

Most Liked Instagram Photo In India : టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇన్​స్టాగ్రామ్​ వేదికాగా పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ఇంతకీ అదేంటంటే?

Most Liked Instagram Photo
Virat Kohli (Associated Press)

Most Liked Instagram Photo In India : టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా విజయం ఎన్నో రికార్డులకు నెలువుగా మారింది. ఇప్పటికే ప్లేయర్ల పర్సనల్ రికార్డులు ఒక్కోటి ట్రెండ్ సృష్టిస్తుండగా, తాజాగా విరాట్ కోహ్లీ ఇన్​స్టాగ్రామ్​ వేదికాగా పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. అదేంటంటే?

వరుస మ్యాచుల్లో విజయం సాధించి ఆఖరి పోరులో గెలుపుతీరాలకు చేరుకుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో బార్బడస్ మైదానంలోని ప్లేయర్లందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక అక్కడి ఫొటోగ్రాఫర్లు కూడా మ్యాచ్​కు సంబంధించిన స్పెషల్ విన్నింగ్ మూమెంట్స్​ను క్యాప్చర్​ చేశారు. అందులో రోహిత్ సేన కప్ అందుకుంటున్న ఫొటో ఒకటి. ఎంతో మంది ఫ్యాన్స్ మెచ్చిన ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట రికార్డులు బ్రేక్ చేస్తోంది.

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. దీంతో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటోగా రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 19 మిలియన్ల లైక్​తో దూసుకెళ్తోంది.

అయితే ఇప్పటి వరకూ ఈ రికార్డు బాలీవుడ్ స్టార్ కపుల్​ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పేరిట ఉండటం విశేషం. ఆ ఫొటో సుమారు 16 మిలియన్ల లైక్స్​తో మొదటి స్థానం కైవసం చేసుకోగా, ఇప్పుడు ఆ ప్లేస్​లో ఈ గ్రూప్ ఫొటో వచ్చింది.

ఇండియాలో విరాట్​ - వరల్డ్​లో ఎవరంటే?

భారత్​లో మోస్ట్​ లైక్​డ్ ఫొటో రికార్డ్ ఇప్పుడు విరాట్​ పేరిట ఉండగా, ప్రపంచంలో మాత్రం ఈ ఫీట్​ను ఫుట్​బాల్​ స్టార్ లియోనెల్ మెస్సీ అందుకున్నాడు. 2022 ఫిఫా వరల్డ్ కప్​ను అర్జెంటీనా గెలిచిన సమయంలో ఆయన షేర్​ చేసిన ఓ ఫొటోకు 75.3 కోట్ల లైక్స్ వచ్చాయి. మెస్సీ ఫోటో తర్వాత అంతటి పాపులారిటీ అందుకున్న ఫొటోల్లో ఓ గుడ్డు ఉండటం విశేషం. 2019లో క్రిస్​ గోడ్ఫ్రే అనే వ్యక్తి పోస్ట్​ చేసిన ఓ గుడ్డు ఫొటోకు సుమారు 61.1 మిలియన్ లైక్స్ వచ్చాయి.

వరల్డ్​కప్​లో మెస్సీ​ ధరించిన జెర్సీలకు రికార్డు ధర- వేలంలో ఆరు టీషర్టులకు రూ.64 కోట్లు!

ఛాంపియన్​గా భారత్- రోహిత్, విరాట్ ఎమోషనల్- గోల్డెన్ మూమెంట్స్​ చూశారా? - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.