Morne Morkel Team India : టీమ్ఇండియాకు శిక్షణ ఇచ్చేందుకు కొత్త బౌలింగ్ కోచ్‌ను అపాయింట్ చేసింది మేనేజ్మెంట్. ఇందుకుగానూ సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తాజాగా ఓ న్యూస్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని, ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో మోర్నీ మోర్కెల్ కోచ్‌గా తన జర్నీని మొదలు పెట్టనున్నాడని క్రికెట్ వర్గాల మాట.
ఇక ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మోర్కెల్ మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. వీరిద్దరూ గతంలో కలిసి ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2014 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గంభీర్ సారథ్యంలో టైటిల్ సాధించింది. అప్పుడు మోర్నీ మోర్కెల్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ఇదిలా ఉండగా, గంభీర్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్న సమయంలో మోర్కెల్ ఆ జట్టుకు బౌలింగ్ కోచ్‌గానూ బాధ్యతలు చేపట్టాడు. దీంతో పాటు మోర్కెల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కోచ్‌గా పనిచేసిన ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉంది. పాకిస్థాన్ జట్టుకు కూడా అతడు కొంతకాలంపాటు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
South African pacer Morne Morkel appointed as new bowling coach of team India: BCCI Secretary Jay Shah to ANI
— ANI (@ANI) August 14, 2024
(File pic) pic.twitter.com/vdnWgOVfHw
మోర్నీ మోర్కెల్ రికార్డులు
సౌతాఫ్రికా తరఫున 247 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన మోర్కెల్ వన్డేల్లో 188, టెస్టుల్లో 309, టీ20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. డేల్ స్టెయిన్, వెర్నాన్ ఫిలాండర్, మోర్కెల్, ఉన్నప్పుడు సౌతాఫ్రికా బౌలింగ్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది.
33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోల్ తెలిపిన మోర్కెల్, ఆ తర్వాత కొంతకాలం పాటు కౌంటీ క్రికెట్లో ఆడాడు. ఆ తర్వాతనే బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించటం ప్రారంభించాడు. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా కోచింగ్ కెరీర్‌ను ప్రారంభించి అక్కడ షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా లాంటి ఎంతో మంది ప్లేయర్లకు శిక్షణ ఇచ్చారు.
మోర్కెల్ ఆల్‌రౌండర్ షో.. విండీస్‌పై సఫారీ జట్టు గెలుపు
బౌలింగ్ కోచ్ రేసులో ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు - బీసీసీఐ ఆన్సర్ ఇదే!