T20 Lowest Score: పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో మరోసారి అత్యల్ప స్కోర్ నమోదైంది. గురువారం సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 10 పరుగులకే కుప్పకూలింది. దీంతో పొట్టి ఫార్మాట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు (Isle of Man's vs Spain) సరసన చేరింది.
టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్‌లో భాగంగా సింగపూర్ జట్టును మంగోలియా ఢీకొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మంగోలియా 10 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. అనంతరం ఛేజింగ్‌లో సింగపూర్ 1 వికెట్ కోల్పోయి 5 బంతుల్లోనే టార్గెట్ అందుకుంది. దీంతో సింగపూర్ టీ20 హిస్టరీలో బంతుల పరంగా రెండో అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సింగపూర్ 115 బంతులు మిగిలుండగానే నెగ్గింది.
కాగా, తొలిసారిగా ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 2023 ఫిబ్రవరిలో స్పెయిన్ (Isle of Man's vs Spain)తో జరిగిన మ్యాచ్‌లో 8.4 ఓవర్లలో 10 పరుగులకే ఆలౌటైంది. టీ20 చరిత్రలో ఇదే తొలిసారి నమోదైన అత్యల్ప స్కోర్ కాగా, తాజాగా మంగోలియా కూడా దాని సరసన చేరింది.
బంతుల పరంగా టీ20ల్లో అతిపెద్ద విజయాలు
మ్యాచ్ | మిగిలిన బంతులు | విన్నర్ |
స్పెయిన్ vs ఐల్ ఆఫ్ మ్యాన్ | 118 బంతులు | స్పెయిన్ (2023) |
సింగపూర్ vs మంగోలియా | 115 బంతులు | సింగపూర్ (2024) |
జపాన్ vs మంగోలియా | 112 బంతులు | జపాన్ (2024) |
హాంగ్ కాంగ్ vs మంగోలియా | 110 బంతులు | హాంగ్‌కాంగ్ (2024) |
కెన్యా vs మాలి | 105 బంతులు | కెన్యా (2022) |
ఆ చెత్త రికార్డూ మంగోలియాదే: కొంతకాలంగా టీ20ల్లో మంగోలియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా టీ20ల్లోనే అత్యల్ప స్కోర్ నమోదు చేయగా, ఇదే ఫార్మాట్లో రెండో అత్యల్ప స్కోర్ రికార్డు కూడా మంగోలియాపైనే ఉంది. ఇదే ఏడాది మే లో జపాన్ను ఢీకొట్టిన మంగోలియా టీమ్ 8.2 ఓవర్లలోనే 12 పరుగులు చేసి కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో జపాన్ నిర్దేశించిన 218 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన మంగోలియా 8.2 ఓవర్లలోనే 12 పరుగులకు ఆలౌటైంది.
12 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో రెండో అత్యల్ప స్కోర్ - Lowest Total In T20 History