Mohammed Shami Comeback : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొకాలి గాయంతో ఎన్సీఏలో కోలుకుంటున్న షమీ కమ్‌బ్యాక్‌పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కివీస్‌తో టెస్టు మ్యాచ్ మధ్యలో నెట్స్‌లో కనిపించాడు. తాజాగా మరోసారి షమీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బెంగళూరు వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌పై భారత్ ఓడిన తర్వాత, అదే గ్రౌండ్లో షమీ నెట్స్‌లో ప్రాక్టీస్‌కు దిగాడు. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, కోచ్ అభిషేక్ నాయర్‌కు షమీ కాసేపు బౌలింగ్ చేశాడు. అయితే తన ఎడమ కాలికి ధరించిన బ్యాండేజీతోనే షమీ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అంటే ఇంకా ఫిజియోల పర్యవేక్షనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ షమీ ఫిట్‌గా ఉన్నట్లుగానే బంతులేశాడు. దీంతో త్వరలోనే షమీని టీమ్ఇండియాలో చూడవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.
SHAMI AT CHINNASWAMY STADIUM...!!! 🔥
— Johns. (@CricCrazyJohns) October 20, 2024
- Shami bowling to the Indian Assistant Coach in nets. [CricSubhayan] pic.twitter.com/WxRm5XohSd
Mohammed Shami, with splendid hair, now bowling as he continues his rehab. pic.twitter.com/prtnEgmtl5
— Swaroop Swaminathan (@arseinho) October 20, 2024
ఇక తాజా అప్డేట్ ప్రకారం షమీ మరో నాలుగు వారాల్లోపే పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన నవంబర్‌లో ప్రారంభమయ్యే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేస్‌కు అనుకూలంగా ఉండే ఆసీస్ పిచ్‌లపై షమీ కీలక పాత్ర పోషిస్తాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్‌తోపాటు షమీ కూడా జట్టులో ఉంటే పేస్ ఎటాక్ మరింత బలంగా ఉండనుంది.
With a heavily strapped left knee, #MohammedShami bowls to #ShubmanGill at the M Chinnaswamy Stadium. #BCCI @DeccanHerald pic.twitter.com/itpxNRrcl1
— Madhu Jawali (@MadhuJawali) October 20, 2024
అయితే టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ టోర్నీల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని నిబంధన ఉంది. మరి షమీ దేశవాళిలో ఆడతాడా? లేదా నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడా అన్నది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంటుంది.
కాగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ గాయపడ్డాడు. అప్పట్నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి కూడా షమీ అందుబాటులో లేడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ అస్ట్రేలియా టూర్‌తో షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.