ETV Bharat / sports

పాకిస్థాన్​ కొత్త కెప్టెన్​ అతడే!

పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్​గా అతడిని నియమించబోతున్న పీసీబీ!

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Pakisthan New Captain
Pakisthan New Captain (Source IANS)

Pakisthan New Captain Mohammad Rizwan : పీసీబీ ప్రస్తుతం పాక్​ జట్టుకు కొత్త కెప్టెన్​ను నియమించే పనిలో నిమగ్నమైందని తెలుస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దగ్గర పడుతున్న నేపథ్యంలో జట్టును సమర్థవంతంగా నడిపించే సారథిని నియమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

2024 టీ20 ప్రపంచ కప్​ ఘోర పరాజయం తర్వాత బాబార్ అజామ్ వైట్ బాల్​ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్​ షాన్ మసూద్​ నాయకత్వం వహిస్తున్నాడు. కానీ అతడు కూడా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో పాక్ జట్టు టెస్ట్​ కెప్టెన్సీ రేసులో సౌద్‌ షకీల్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, సల్మాన్‌ అలీ అఘా పేర్లు వినబడుతున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్​గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం అందింది. పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్​ నఖ్వీ, వైట్ బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ కరాచీలో సెలక్టర్స్​తో కలిసి సమావేశం నిర్వహించారట. ఆ భేటీలో రిజ్వాన్​ను కొత్త కెప్టెన్​గా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారట. "డొమాస్టిక్ క్రికెట్​, పీఎస్​ఎల్​లో జట్టును నడిపించిన అనుభవం ఉన్న మహ్మద్ రిజ్వాన్​ను వైట్​ బాల్ కెప్టెన్​గా నియమించాలని అనుకుంటున్నాం" అని పీసీబీ వర్గాలు తెలిపాయి.

కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్​తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ ఆ తర్వాత మూడు వన్డేలు, టీ20ల సిరీస్​ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అనంతరం జింబాబ్వే, దక్షిణాప్రికాతోనూ వైట్ బాల్ సిరీస్​ ఆడనుంది. అలాగే ప్రొటీస్​ జట్టుతో రెండు టెస్ట్​ మ్యాచుల్లోనూ పోటీ పడనుంది. ఇంకా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కూడా ఉంది. కాబట్టి ఒకవేళ మహ్మద్ రిజ్వాన్​కు పగ్గాలు అప్పగిస్తే అతడి ముందు పెద్ద సవాలే ఉన్నట్లు.

భారత్, పాక్ మ్యాచ్​కు అంతా రెడీ - హెడ్ టు హెడ్ రికార్డ్స్​ ఇవే - మ్యాచ్​​ ఎందులో చూడాలంటే?

టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియా సంచలన రికార్డ్​ - 147 ఏళ్లలో తొలిసారి ఇలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.