Pakistan New Captain : పాకిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. అతడు టీ20, వన్డే కెప్టెన్‌గా ఎంపికైనట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ తెలిపారు. లాహోర్‌లో ఆదివారం జరిగిన ప్రెస్మీట్లో నఖ్వీ ప్రకటించారు. ఇక ఆల్‌రౌండర్ సల్మాన్ ఆఘాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ మేరకు పీసీబీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
కాగా, పాకిస్థాన్ నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌తోనే రిజ్వాన్ కెప్టెన్‌గా జర్నీ ప్రారంభించనున్నాడు. ఇక ఇదే పర్యటనలో ఆసీస్‌తో పాక్ టీ20 సిరీస్‌లోనూ ఆడనుంది. ఆ తర్వాత పాక్ జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు కూడా పాక్ జట్టును పీసీబీ ఆదివారమే ప్రకటించింది. కాగా, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఇదే నెలలో వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
— Pakistan Cricket (@TheRealPCB) October 27, 2024
Babar Azam Captaincy Record: బాబర్ 2019లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పట్నుంచి పాకిస్థాన్ జట్టును అన్ని ఫార్మాట్లలో సమర్థంగా నడిపించాడు. బాబర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ మూడు ఫార్మాట్లలో 84 మ్యాచ్‌లు నెగ్గింది. పాక్ క్రికెట్లో రెండో అత్యత్తమ కెప్టెన్‌గానూ నిలిచాడు. కానీ, గత ఏడాదిగా పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్, 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది.
PCB Central Contracts : 2024-25 సీజన్‌కుగాను పాక్ ప్లేయర్లకు పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ప్రకటించింది. 2024 జులై 1 నుంచి ఈ కాంట్రాక్ట్‌లు అమల్లో ఉంటాయని తెలిపింది. మొత్తం 25 మంది ఆటగాళ్లకు ఈ కాంట్రాక్ట్‌లు పొందగా, ఐదుగురు యంగ్ ప్లేయర్లు తొలిసారి చోటు దక్కించుకున్నారు. కేటగిరీ Aలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్‌ను కొనసాగించారు. ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది కేటగిరీ Bకి డిమోట్ అవ్వగా, టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ కేటగిరీ D నుంచి Bకి ప్రమోట్ అయ్యాడు.
PCB Chairman Mohsin Naqvi, selection committee members Aqib Javed and Azhar Ali, along with Pakistan's white-ball captain Mohammad Rizwan and vice-captain Salman Ali Agha's press conference in Lahore.
— Pakistan Cricket (@TheRealPCB) October 27, 2024
Watch live ➡️ https://t.co/ou4SCVgxGl pic.twitter.com/W4QaRnWmKf
బాబర్ షాకింగ్ డెసిషన్- కెప్టెన్సీకి గుడ్‌బై- ఏడాదిలో ఇది రెండోసారి - Babar Azam Captaincy
బాబార్ అజామ్‌పై వేటు! - కొత్త సారథి ఎవరంటే? - Pakisthan Cricket Team New Captain