ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్​కు మొయిన్ అలీ రిటైర్మెంట్​ - Moeen Ali Retirement

Moeen Ali Retirement : ఇంగ్లాండ్ స్టార్‌ క్రికెటర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అభిమానులకు షాకిచ్చాడు.

Moeen Ali Retirement
Moeen Ali Retirement (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 8, 2024, 10:26 AM IST

Updated : Sep 8, 2024, 10:51 AM IST

Moeen Ali Retirement : ఇంగ్లాండ్ స్టార్‌ క్రికెటర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అభిమానులకు షాకిచ్చాడు. 2014లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఆల్​రౌండర్ తన కెరీర్​లో ఇప్పటి వరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 6,600కిపైగా స్కోర్ సాధించాడు. ఇక బౌలింగ్‌లోనూ రాణించిన ఈ క్రికెటర్ ఇప్పటివరకూ 360+ వికెట్లను పడగొట్టి రికార్డుకెక్కాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్న మొయిన్ అలీ అందులోనూ ఆడిన 67 మ్యాచుల్లో 1,162 పరుగులు, 35 వికెట్లు తీసి చరిత్రకెక్కాడు.

"నాకిప్పుడు 37 ఏళ్లు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌కు నేను ఎంపిక కాలేదు. మున్ముందు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పటికే ఇంగ్లాండ్ తరఫున చాలా మ్యాచ్​లు ఆడేశాను. ఇక కొత్త తరం జట్టులోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. నేను రిటైర్‌మెంట్‌ తీసుకున్నప్పటికీ, నాకేం బాధగా లేదు. ఇప్పటికీ క్రికెట్‌ ఆడగలను. కానీ, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే సరైన సమయం అని భావించాను" అని అలీ తాజాగా తన రిటైర్మెంట్​పై స్పందించాడు.

Ashes 2023 Moeen Ali : అయితే 2021 సెప్టెంబర్‌లో మొయిన్ అలీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2023 యాషెస్​ నేపథ్యంలో జట్టు ఎంపిక చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్​ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల యాషెస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మొయిన్​ అలీని ఎంచుకోవాలని బోర్డు నిర్ణయించుకుంది. అయితే అప్పటికే టెస్టులకు అలీ రీటైర్మెంట్​ ప్రకటించాడు. అయినప్పటికీ.. యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ మొయిన్​ను వెనక్కి రప్పించింది. 'యాషెస్ ఆడతావా?' అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెసేజ్ చేయగా.. అలీ ఆ మెసేజ్​కు ఓకే చెప్పాడు. అలా ఈ ఏడాది యాషెస్‌ సిరీస్‌కు మొయిన్​ అలీని ఇంగ్లాండ్‌ సెలక్టర్లు ఎంపిక చేసుకున్నారు. అలా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. అయితే మంగళవారం జరిగిన యాషెస్​ చివరి టెస్ట్​ తర్వాత మరోసారి తన రిటైర్మెంట్​ ప్రకటించి అందరిని షాక్​కు గురి చేశాడు.

Cricketers Retirement Reversal : రిటైర్మెంట్​ ఇచ్చి యూటర్న్ తీసుకున్న ప్లేయర్స్ వీళ్లే..

'ఐపీఎల్​ అంటే చాలు విమానాలు ఎక్కేస్తారు.. ఆ మాత్రం దేశం కోసం ఆడలేరా?'

Last Updated : Sep 8, 2024, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.