ETV Bharat / sports

దిల్లీ జట్టుకు షాక్ - ఆ కారణంగా స్టార్ క్రికెటర్ దూరం! - Mitchell Marsh Delhi Capitals - MITCHELL MARSH DELHI CAPITALS

Mitchell Marsh Delhi Capitals : దిల్లీ క్యాపిటల్స్​కు తాజాగా ఓ షాక్ ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ మిగతా మ్యాచ్​లకు దూరమయ్యాడు. ఇంతకీ అతడికి ఏమైందంటే ?

Mitchell Marsh Delhi Capitals
Mitchell Marsh Delhi Capitals
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 10:11 AM IST

Updated : Apr 14, 2024, 10:47 AM IST

Mitchell Marsh Delhi Capitals : ఇటీవలే లఖ్​నవూపై పైచేయి సాధించిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు తాజాగా ఓ షాక్ ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ మిగతా మ్యాచ్​లకు దూరమయ్యాడు. చీలమండలో పగులు రావడం వల్ల ఆపరేషన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని స్వదేశానికి రావాలని సూచించింది. దీంతో విశ్రాంతి తీసుకునేందుకు అతడు ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. అయితే, చికిత్స తర్వాత తదుపరి పరిస్థితిని బట్టి మిచెల్ దిల్లీ జట్టులో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిగా మార్ష్‌ ఆడాడు. ఆ తర్వాత ముంబయి, లఖ్‌నవూ మ్యాచ్‌లకు కూడా అతడు దూరమయ్యాడు. ఈ టోర్నీలో విఫలమైన మిచెల్​, రాజస్థాన్‌పై అత్యధికంగా 23 పరుగులను స్కోర్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక ఆస్ట్రేలియా టీ20 జట్టుకు మార్ష్ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇది దృష్టిలో ఉంచుకుని అతడు మరింత విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.

ఇక ఇప్పటి వరకు దిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం ఆరు మ్యాచ్​లు ఆడింది. అందులో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

తాజాగా జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​పై దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఆల్​రౌండ్ ప్రదర్శనతో ఎట్టకేలకు వరుస ఓటముల నుంచి బయటపడింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్​ మొదట్లో కాస్త తడబడింది. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8 పరుగులు) స్వల్ప స్కోర్​కే వెనుదిరిగాడు. వార్నర్​ను యశ్ ఠాకూర్ క్లీన్​ బౌల్డ్ చేశాడు. తర్వాత కాసేపటికి మరో ఓపెనర్ పృథ్వీ షా (32 పరుగులు) కూడా పెవిలియన్ చేరాడు. అయితే వన్​డౌన్​లో వచ్చిన జేక్ ఫ్రాజర్, రిషబ్ పంత్ మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా కుర్రాడు జేక్‌ ఫ్రేజర్‌ (35 బంతుల్లో 2×4, 5×6 సాయంతో 55;), పంత్‌ (24 బంతుల్లో 4×4, 2×6 సాయంతో 41) చెలరేగడంతో దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (2/25) మెరిశాడు.

6, 6, 6, 4, 4, 6 - అరంగేట్రంలోనే అదరగొట్టేసిన జేక్ ఫ్రేజర్ ఎవరంటే? - IPL 2024 Lucknow Super Giants VS DC

చరిత్ర సృష్టించిన పంత్​ - తొలి బ్యాటర్​గా రికార్డు - IPL 2024 LSG VS DC

Last Updated : Apr 14, 2024, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.