MI vs KKR IPL 2024: 2024 ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ గంటన్నరసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్ టాస్ నెగ్గిన ముంబయి కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ సునీల్ నరైన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే నరైన్‌ను, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. బుమ్రా యార్కర్‌ను సరిగ్గా అంచనా వేయలేని నరైన్ బంతిని ఆడకుండా వదిలేశాడు. అంతలోనే బంతి ఆఫ్ స్టంప్స్‌ను గిరాటేసింది. ఇదంతా ఒక సెకన్లో జరిగిపోయింది. దీంతో నరైన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ మ్యాచ్‌లో 16 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (6 పరుగులు), నరైన్ (0) స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. కాసేపటికి 4.1 వద్ద కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7 పరుగులు) కూడా విఫలమయ్యాడు. యంగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (42 పరుగులు, 23 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వెంకటేశ్ అయ్యర్‌ను పియూశ్ చావ్లా అద్భుత బంతితో బోల్తో కొట్టించాడు.
మిడిలార్డర్లో వచ్చిన నితీశ్ రానా (33 పరుగులు, 23 బంతుల్లో), ఆండ్రీ రస్సెల్ (21 పరుగులు, 14 బంతుల్లో) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపంతో రానా రనౌట్ అయ్యాడు. రానా ఔటైన తర్వాతి ఓవర్లోనే (12. 6 ఓవర్) రస్సెల్‌ను చావ్లా పెవిలియన్ చేర్చాడు. చివర్లో రింకూ సింగ్ (20 పరుగులు, 12 బంతుల్లో), రమన్‌దీప్ సింగ్ (17*) ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పీయుశ్ చావ్లా చెరో 2, నువాన్ తుషారా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ వికెట్ దక్కించుకున్నారు.
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన బుమ్రా - ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ - Jasprit Bumrah youtube channel
ఆర్సీబీపై విజయం - బుమ్రా ఖాతాలోకి పలు రికార్డులు - IPL 2024 RCB VS Mumbai Indians