Memorable Test Series For Debut Players : ఏ క్రీడలోనైనా ఆటగానికి తమ కెరీర్ తొలి మ్యాచ్ అనేది చాలా కీలకం. చాలా సందర్భాల్లో తమ తొలి మ్యాచ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారి క్రీడా భవిష్యత్తు ఆదారపడుతుంది. ఇక క్రికెట్ విషయానికస్తే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదా ఇక అంతే సంగతులు. ఇదిలా ఉండగా ఐపీఎల్‌కు ముందు జరిగిన భారత్ - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఐదుగురు యువ ఆటగాళ్లు తమ టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించారు. అంతే కాదండోయ్ వారి ఆరంగ్రేటం మ్యాచ్‌లో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. వారి వివరాలు తెలుసుకోవాలనుందా ఈ స్టోరీ చదవండి.
- ధ్రువ్ జురేల్
ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ తన ప్రారంభ మ్యాచ్ రాజ్ కోట్లో ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత రాంచీలో జరగిన నాలుగో టెస్ట్ లో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను 90 పరుగులు చేసి 307 పరుగులు గౌరవప్రద స్కోర్‌కు చేర్చాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. - సర్ఫరాజ్ ఖాన్
యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రాజ్ కోట్లో ఆడిన తన తొలి మ్యాచ్ లో 66 బంతుల్లో 62 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ 68 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. - ఆకాశ్ దీప్
టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ పేస్ తన బౌలర్ ఆరంగ్రేట మ్యాచ్‌లోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బెన్ డకేట్ , ఒల్లి పోప్, జాక్ క్రౌలీ లాంటి స్టార్ ప్లేయర్ల వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. - టామ్ హర్ట్లీ
ఇంగ్లాండ్ తరపున హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన టామ్, తొలి మ్యాచ్‌లోనే తొమ్మిది వికెట్లు నేలకూర్చాడు. నాలుగు మ్యాచుల్లో 20 వికెట్లు స్వాధీనం చేసుకున్నాడు. అంతే కాకుండా 159 పరుగులు కూడా స్కోర్ చేశాడు. - షోయబ్ బషీర్
ఇంగ్లాండ్ తరఫున తన టెస్ట్ డెబ్యూ ఇచ్చిన చేసిన షోయబ్, వీసా సమస్యతో తన తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు. అయితే రాంచీ వేదికగా జరిగిన పోరులో తొలి ఇన్నింగ్స్‌లోనే 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. షోయబ్ మెుత్తంగా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
రోహిత్ చెప్పిన ఒక్క మాటతో సర్ఫరాజ్ సేఫ్- లేకుంటే ప్రమాదమే!
100వ టెస్ట్ : అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!