Mayanak Yadav IPL 2025 : తన తొలి టీ20 మ్యాచ్‌లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన 22 ఏళ్ల మయాంక్ యాదవ్, అలాగే తెలుగు తేజం నితీశ్ రెడ్డి తాజాగా మరో అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకోనున్నారు. ఐపీఎల్ ద్వారా మిలియన్ డాలర్ల క్లబ్ వైపుకు ఈ యంగ్ క్రికెటర్స్ అడుగులు వేయనున్నారు. అది ఎలాగంటే?
మయాంక్ పై ఆ జట్టు స్పెషల్ ఇంట్రెస్ట్
ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మయాంక్‌ను ఆ జట్టులో రిటైన్ చేసుకునేందుకు కనీసం రూ. 11 కోట్లను ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక తెలుగు తేజం నితీశ్ రెడ్డిని కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకోవాలంటే వాళ్లు అతడికి సుమారు రూ.11 కోట్లకు మేర చెల్లించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. తమ అద్భుతమైన పెర్ఫామెన్స్ వల్ల ఆయా ఫ్రాంచైజీలు కూడా వాళ్లకు అంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
గత ఐపీఎల్ సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌గా బరిలోకి దిగిన ఆ ఇద్దరూ ఇప్పుడు టీమ్ఇండియాలో కీలక ప్లేయర్లుగా మారి దుసుకెళ్లడం కూడా ఇందుకు కారణం కావొచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ రిటెన్షన్ నిబంధనల ప్రకారం వేలానికి ముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఇప్పుడు క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్‌లో వస్తారు. ఈ నేపథ్యంలో తొలి ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్‌ల రిటెన్షన్ ధరలు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు , రూ. 11 కోట్లుగా బీసీసీఐ తాజాగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో ప్లేయర్‌కు తిరిగి రూ. 18 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 14 కోట్లు ఇవ్వాలని సూచించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోనున్న క్రికెటర్ల జాబితాను అక్టోబర్ 31 కల్లా అందించాల్సి ఉంటుంది.
అయితే గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో ఇప్పుడు మయాంక్‌ను అంతమొత్తం వెచ్చించి రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రికెట్ వర్గాల మాట. ఈ నేపథ్యంలో మయాంక్ ఒకవేళ ఆ జట్టుకి మూడో రిటెన్షన్ ప్లేయర్‌గా ఎంపికైనా కూడా అతడు రూ.11 కోట్లు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు నితీశ్ రెడ్డిని కూడా మెగా వేలంలోకి పంపించి 'రైట్ టు మ్యాచ్' (ఆర్‌టీఎం) రూల్ కింద మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తొలి ఓవరే 'మెయిడెన్'- డెబ్యూలోనే మయాంక్ అరుదైన రికార్డ్ - Mayank Yadav Debut
నా వల్లే నాన్నపై విమర్శలు- ఇప్పుడు ఫోన్ చేసి మరీ ప్రశంసలు: నితీశ్ రెడ్డి - Nitish Kumar Reddy