Marcus Stoinis LSG : ఐపీఎల్ 2024లో భాగంగా ఇటీవలె చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. కేవలం 63 బంతుల్లో 124 పరుగులు బాది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు విజయం అందించాడు.
అయితే అద్భుత ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన స్టాయినిస్‌ను ఆస్ట్రేలియా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సెలక్షన్‌కు పరిశీలిస్తుందని కొందరు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. దీంతో తనకున్న అవకాశాలు, ఆలోచనలను స్టాయినిస్ తెలిపాడు.
వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన 2024-25 సీజన్ సెంట్రల్ కాంట్రాక్టు లిస్టులో స్టాయినిస్ చోటు కోల్పోయాడు. అయితే దీనిపై తాను నిరాశ చెందలేదని, యంగ్ క్రికెటర్లకు అవకాశం రావడంపై సంతోషంగానే ఉన్నానని స్టాయినిస్ చెప్పుకొచ్చాడు.
అందుకే ఐపీఎల్ ఇష్టం
"ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు కాంట్రాక్ట్ రాలేదని, కొంతకాలం క్రితమే తెలిసింది. కానీ యంగ్ ప్లేయర్‌లకు ఆ చోటు దక్కడం సంతోషంగానే ఉంది. అయితే ఆటపరంగా నా సామర్థ్యాలు ఉన్న స్థాయిలో ఉన్నాయని నిర్ధారించుకోవాలనుకుంటున్నాను. అందుకే ఐపీఎల్ ఆడుతున్నాను. ఇలాంటి లీగ్‌లు నాకు చాలా లక్కీ. అందుకే నేను ఐపీఎల్‌ను బాగా లవ్ చేస్తాను." అని స్టాయినిస్ చెప్పాడు.
మరోవైపు బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున స్టాయినిస్ ఆడుతున్నాడు. అయితే ఈ ఏడాది జనవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు అతడిని ఆస్ట్రేలియా ఎంపిక చేయలేదు. కానీ త్వరలోనే వెస్టిండీస్, యూఎస్‌లో జరుగనున్న టీ20కి మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా పరిశీలనలో ఉన్నాడు. అయితే స్టాయినిస్ సాధారణంగా ఆరో స్థానంలో ఆడతాడు.
దీంతో మెగా టోర్నీకి అదే స్థానంలో ఎంపికయ్యే అవకాశం ఉంది. కానీ సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో, నవంబర్‌లో స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడాలని ఉదని స్టాయినిస్ స్పష్టంగా చెప్పాడు.
ఐపీఎల్‌లో స్టాయినిస్ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. బ్యాట్, బాల్‌తో అంతకు ముందు వరకు ఆకట్టుకునే ప్రదర్శనలు ఏవీ చేయలేదు. చెన్నై మ్యాచ్‌లో మొదటిసారి మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అజేయంగా 124 పరుగులు చేశాడు. సీజన్లో ఇదే రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 196.83 స్ట్రైక్ రేటుతో రన్స్ చేశాడు, మొత్తం 13 ఫోర్లు, 6 సిక్సుల బాదాడు. ఐపీఎల్ హిస్టరీలో ఛేజింగ్‌లో ఓ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే.
స్టాయినిస్ చెన్నైపై అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు. 2014లో క్వాలిఫయర్ 2లో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 122 పరుగులను అధిగమించాడు.
సెంచరీతో చెలరేగిన స్టొయినిస్ - ఉత్కంఠ పోరులో చెన్నైపై లఖ్‌నవూ థ్రిల్లింగ్ విక్టరీ - IPL 2024
సగానికిపైగా మ్యాచులు పూర్తి - ఎవరు టాప్‌లో ఉన్నారంటే? - IPL 2024