Manu Bhaker Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య సంభాషణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పతకాల విజేతలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. మనుతో నీరజ్ సరదగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. నీరజ్ ఏదో చెబుతుండగా మను క్యూట్‌గా నవ్వుతూ అలాగే అన్నట్లు తల ఊపడంతో ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
నిమిషాల్లోనే వీడియో వైరల్ అవ్వడం వల్ల నెటిజన్లు కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. 'వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది', 'ఫ్యూచర్ ఇండియన్ అథ్లెట్ కపుల్', 'బెస్ట్ కపుల్', 'నీరజ్ సిగ్గుపడుతున్నాడు' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక 'వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్', 'మెడల్ విన్నర్స్ ఇంట్రెస్టింగ్ టాక్' అని మరికొన్ని కామెంట్స్ వచ్చాయి.
Neeraj Chopra and Manu Bhakar talking to each other. 🌟pic.twitter.com/ghL9iSB2hz
— Tanuj Singh (@ImTanujSingh) August 11, 2024
మను అమ్మతో స్పెషల్ టాక్
ఇదిలా ఉండగా మను బాకర్ తల్లి సుమేధా బాకర్ కూడా నీరజ్‌తో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. పారిస్‌లో సిల్వర్ సాధించిన నీరజ్‌ను మను తల్లి అభినందించింది. ఆమె మాట్లాడుతుంటే నీరజ్ శ్రద్దగా విన్నాడు. ఈ క్రమంలో నీరజ్ చేయి తీసుకోని సుమేధా ఏదో ప్రామిస్ అడిగినట్లు తన తలపై వేసుకుంది. దీంతో 'అసలు ఏం జరుగుతోంది' కన్ఫ్యూజ్లో ఉన్నామంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే వాళ్ల మధ్య సంభాషణ గురించి ఎలాంటి క్లారిటీ లేదు.
Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7
— Avinash Aryan (@avinasharyan09) August 11, 2024
కాగా, ఈ ఒలింపిక్స్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించింది. ఒకటి 10మీటర్లు ఎయిర్ రైఫిల్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్లో రాగా, మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం అందుకుంది. దీంతో స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలిపింక్స్‌లో రెండు పతకాలు అందుకున్న అథ్లెట్‌గా నిలిచింది. మరోవైపు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ ముద్దాడాడు. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన నీరజ్ స్వర్ణం సాధిస్తాడని ఆశించారు. కానీ, రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
'ఐయామ్ సారీ- నేను పారిస్ వెళ్లింది ఇందుకోసం కాదు' - Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్: భారత్ ఖాతాలో 6 పతకాలు- త్రుటిలో చేజారినవి ఎన్నో తెలుసా? - Paris Olympics 2024