ETV Bharat / sports

కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న రాహుల్- ఆ ఓటమే కారణమా? - IPL 2024 - IPL 2024

Kl Rahul Lsg Captaincy: సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ఓటమి తర్వాత లఖ్​నవూ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిసైడయ్యాయట.

Kl Rahul LSG Captaincy
Kl Rahul LSG Captaincy (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 6:47 PM IST

Updated : May 9, 2024, 7:15 PM IST

Kl Rahul Lsg Captaincy: లఖ్​నవూ సూపర్​ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సన్​రైజర్స్​పై ఘోర ఓటమి తర్వాత ఫ్రాంచైజీ ఓనర్​తో జరిగిన సంభాషణ వీడియో చక్కర్లు కొట్టడం వల్ల ఈ వార్తలకు తెరలేచింది. ఈ సీజన్​లో లఖ్​నవూ ఇంకో రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్​లకు రాహుల్ కెప్టెన్​గా వ్యవహరించకపోవచ్చని సమాచారం.

'లఖ్​నవూ మే14న దిల్లీతో తలపడనుంది. అంటే దాదాపు వారం రోజుల గ్యాప్ ఉంది. ఈ సమయంలో రాహుల్ బ్యాటింగ్​పై దృష్టి సారించేందుకు కెప్టెన్సీ వదిలేసే ఛాన్స్ ఉంది. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు' అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్​కే కాకుండా మొత్తం ఫ్రాంచైజీకే రాహుల్ గుడ్​బై చెప్పే ఛాన్స్​ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, లఖ్​నవూ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్​ల్లో నెగ్గడం తప్పనిసరి.

మెగా వేలంలో ఉంటాడా? 2022 సీజన్​లో లఖ్​నవూ ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి లఖ్​నవూకు రాహులే సారథ్యం వహిస్తున్నాడు. వరుసగా రెండేళ్లు (2022, 2023) ప్లేఆఫ్స్​కు కూడా చేర్చాడు. ఈ సీజన్​లోనూ ఫస్ట్​హాఫ్​లో అదరగొట్టిన లఖ్​నవూ సెకండ్ హాఫ్​లో తడబడింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్​ల్లో నెగ్గితేనే లఖ్​నవూకు టాప్- 4లో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. లేదంటే టోర్నీ నుంచి వైదొలుగుతుంది. దీంతో వచ్చే సీజన్​నాటికి మెగావేలంలో రాహుల్​ను రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ​

అసలేం జరిగిందంటే? బుధవారం సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను లఖ్​నవూ మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లఖ్​నవూ ఓనర్ సంజీవ్, కెప్టెన్ రాహుల్​తో అసంతృప్తితో మాట్లాడినట్లు కనిపించారు. గోయెంకా కోపంగా రాహుల్‌తో ఏదో అన్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. రాహుల్ ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా గోయెంకా వినడానికి ఇష్టపడలేదు. ఇంతలోనే అక్కడకు కోచ్ జస్టిన్ లాంగర్ రాగా, రాహుల్ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మరి అక్కడ జరిగిన సంభాషణ గురించి తెలియాలంటే లఖ్​నవూ యాజమాన్యం స్పందించాల్సిందే.

కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డ లఖ్​నవూ యజమాని! - వైరల్​ వీడియో చూశారా? - IPL 2024 LSG

'నాకు 'టెస్టు ప్లేయర్' ట్యాగ్ ఇచ్చారు- అప్పట్నుంచే ​అందరూ నన్ను నమ్మారు' - IPL 2024

Last Updated : May 9, 2024, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.