LSG VS RR IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. జైపుర్ వేదికగా జరిగిన ఈ పోరులో రాజస్థాన్ జట్టు లఖ్‌నవూపై 20 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (64*), కేఎల్ రాహుల్ (58) తప్ప ఎవ్వరూ రాణించసలేకపోయారు. అర్ధ శతకాలు బాదినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, నంద్రీ బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ సాగిందిలా :
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కెప్టెన్సంజు శాంసన్ (82*) సూపర్ ఫామ్‌లో ఆడి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (43) కూడా మెరుగ్గా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ధ్రువ్ జురెల్ (20*) పరుగులు చేశాడు. అయితే పవర్ హిట్టర్ హెట్‌మయర్ మాత్రం 5 పరుగులే స్కోర్ చేసి నిరాశ పరిచాడు. లఖ్‌నవూ బౌలర్లలో నవీనుల్ హక్ 2, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లఖ్‌నవూ జట్టు నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ గెలవలేకపోయింది. మ్యాచ్ తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ డికాక్ (4) వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్‌డౌన్ వచ్చిన పడిక్కల్ (0) కూడా ఔటయ్యాడు. వెనువెంటనే ఆయుష్ బదౌనీ (1) కూడా నిరాశపరచడం వల్ల కొద్దిసేపటికే లఖ్‌నవూ జట్టు తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయింది.
దీంతో జట్టును ఆదుకునేందుకు వచ్చినట్లుగా దీపక్ హుడా (26)తో కలిసి కెప్టెన్ కేఎల్ రాహుల్ (58); మంచి ఇన్నింగ్స్ నెలకొల్పారు. అయితే ఈ ఇద్దరూ కూడా విఫలమయ్యారు. పూరన్ (64*) పోరాడినప్పటికీ గెలవలేకపోయారు.
ఉత్కంఠ పోరుతో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా విజయం - KKR VS SRH IPL 2024